టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ #RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబందించిన లుక్స్ ఇప్పటివరకు ఒక్కటి మాత్రమే రిలీజాయినా అభిమానులు మాత్రం వారి స్థాయిల్లో పోస్టర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. 

రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఇది ఎవరైనా మొదటిసారి చూస్తే అఫీషియల్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టరే అనుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 

ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా ఒక యాక్షన్ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్న చిత్ర యూనిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది. నెక్స్ట్ షెడ్యుల్‌ను అహ్మదాబాద్‌, పుణె ప్రాంతాల్లో కొనసాగించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మిస్తున్నాడు.