దృశ్యం 2 సినిమాను అమెజాన్ లో చూసిన రాజమౌళి దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రతిభకు ముగ్దుడు అయ్యాడట.నటీనటుల పెర్ఫార్మన్స్ దగ్గర నుండి ప్రతి విభాగం అద్భుతం అని ఆయన అన్నారు. ఇక దృశ్యం 2 రైటింగ్ మరో స్థాయిలో ఉందన్న రాజమౌళి దృశ్యం 2 ప్రపంచ స్థాయి చిత్రం అన్నారు.


దర్శక ధీరుడు రాజమౌళి మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం సిరీస్ మాస్టర్ పీస్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు దృశ్యం 2 తెరకెక్కించారు. మీనా హీరోయిన్ గా నటించిన ఈ సస్పెన్సు థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ లో ఇటీవల విడుదలైంది. దృశ్యం చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కించిన దృశ్యం 2 సైతం హిట్ టాక్ సొంతం చేసుకుంది. 


దృశ్యం 2 సినిమాను అమెజాన్ లో చూసిన రాజమౌళి దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రతిభకు ముగ్దుడు అయ్యాడట. దృశ్యం 2 సినిమా చూడడం కోసం రాజమౌళి మొదటి పార్ట్ దృశ్యం సినిమా చూశారట. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన దృశ్యం చూసిన రాజమౌళి మోహన్ లాల్ నటించిన మలయాళ వర్షన్ చూడలేదట. తాజాగా దృశ్యం రెండు భాగాలూ రాజమౌళి చూశారట. నటీనటుల పెర్ఫార్మన్స్ దగ్గర నుండి ప్రతి విభాగం అద్భుతం అని ఆయన అన్నారు. ఇక దృశ్యం 2 రైటింగ్ మరో స్థాయిలో ఉందన్న రాజమౌళి దృశ్యం 2 ప్రపంచ స్థాయి చిత్రం అన్నారు. 

రాజమౌళి లాంటి దర్శకుడు ఆ స్థాయిలో ఓ చిత్రాన్ని పొగడం గొప్ప విషయమే అని చెప్పాలి. దృశ్యం 2 తెలుగులో రీమేక్ కానుంది. దృశ్యం సీక్వెల్ కూడా వెంకటేష్ నటించడం విశేషం. ఈ మధ్యనే అధికారికంగా ఈ మూవీ ప్రకటన జరిగింది. ఒరిజినల్ తెరకెక్కించిన జీతూ జోసెప్ దృశ్యం 2 తెలుగు వర్షన్ తెరకెక్కిస్తున్నారు.