Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్నేషనల్ ఈవెంట్ గవర్నర్స్ అవార్డు వేదికపై మెరిసిన రాజమౌళి! 


లాస్ ఏంజెల్స్ లో జరిగిన ప్రఖ్యాత ఇంటెర్నేషనల్ సినిమా ఈవెంట్ గవర్నర్స్ అవార్డు ఈవెంట్ లో రాజమౌళి పాల్గొన్నారు. ఈ ప్రముఖ ఈవెంట్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. 
 

rrr director rajamouli attends international movie event governors  award
Author
First Published Nov 20, 2022, 12:34 PM IST

ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత రాజమౌళిదే. బాహుబలి సిరీస్ తో దేశం మెచ్చిన దర్శకుడైన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో మరిన్ని అరుదైన గౌరవాలు అందుకుంటున్నారు. గ్లోబల్ వేదికలపై ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటుతుంది. ఆర్ ఆర్ ఆర్ దర్శకుడైన రాజమౌళి ఇంటర్నేషనల్ వేదికలపై మెరుస్తున్నారు. తాజాగా ఆయన ప్రఖ్యాత గవర్నర్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. 

ప్రతి ఏడాది ఆస్కార్ ఈవెంట్ కి ముందు లాస్ ఏంజెల్స్ లో గవర్నర్స్ అవార్డుల ప్రధానం నిర్వహిస్తారు. చిత్ర ప్రముఖులను గౌరవ అవార్డులతో సత్కరించడం జరుగుతుంది. పలువురు అంతర్జాతీయ చిత్ర ప్రముఖులు గవర్నర్స్ అవార్డ్స్ ఈవెంట్ కి హాజరయ్యారు. నవంబర్ 19న జరిగిన ఈ ఈవెంట్ కి ఇండియా నుండి రాజమౌళికి అవకాశం దక్కింది. టాక్సేడో సూట్ లో రాజమౌళి సూపర్ స్టైలిష్ గా మెరిశారు. 

ఆర్ ఆర్ ఆర్ మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో  ప్రతిష్టాత్మక సాటర్న్ అవార్డు గెలుచుకుంది. గతంలో బాహుబలి 2 సినిమాకు సాటర్న్ అవార్డు రాజమౌళి అందుకున్నారు. రెండు సార్లు రాజమోళికి ఈ గౌరవం దక్కింది. కాగా ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ నుండి పంపిన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ నామినేషన్స్ లో లేదు. ఆర్ ఆర్ ఆర్ ని జ్యూరీ సభ్యులు ఎంపిక చేయకపోవడంపై విమర్శలు నెలకొన్నాయి. అయితే జనరల్ కేటగిరీలో మొత్తం 15 విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కోసం అప్లై చేశారు. 

మరో వైపు జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. నాలుగు వారాల్లో ఈ మూవీ 250 మిలియన్ జపాన్ యెన్స్ వసూలు చేసింది. ఈ మార్క్ చేరుకోవడానికి బాహుబలి 2 చిత్రానికి ముప్పైకి పైగా వారాల సమయం పట్టింది. ఈ ఈనేపథ్యంలో రజినీకాంత్ ముత్తు, ప్రభాస్ బాహుబలి 2 చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. జపాన్ లో మూవీస్ కి లాంగ్ రన్ ఉంటుంది. కాబట్టి ముత్తు పేరిట ఉన్న హైయెస్ట్ ఇండియన్ మూవీ వసూళ్లు 400 మిలియన్ యెన్స్ ని ఆర్ ఆర్ ఆర్ అధిగమించవచ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios