మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా తెర‌కెక్కుతోన్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ సినిమాలో హీరోయిన్స్  ఎంపిక‌పై రాజ‌మౌళి క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో రాజమౌళి ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌టంలేదు. 

అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఉపయోగించుకుంటూ టాప్ టెక్నీషియ‌న్ల‌తో ముందుకు వెళ్లున్నాడు. సినిమాకు ఎంచుకుంటున్న న‌టీన‌టుల‌ను ఆ ఇద్ద‌రి స్టార్ హీరోల ఇమేజ్ కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ ని సంప్రదించి ఓకే చేయించినట్లు సమాచారం. 

మొదట్లో  సమంత, కీర్తి సురేశ్‌, అదితి రావు హైదరి, పరిణీతి చోప్రా పేర్లు వినిపించాయి. కాగా చివరకి బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని అలియా భట్ ని ఫైనల్ చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలియా ఎంతో గౌరవించే నిర్మాత కరణ్‌ జోహార్‌ ద్వారా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 

ఆర్ ఆర్ ఆర్ లో న‌టించ‌డానికి త‌మ‌కేమి అభ్యంత‌రం లేద‌ని అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారుట‌. అయితే రెమ్యునేషన్ విషయంలో మాత్రం అలియా భ‌ట్ కు కాస్త ఎక్కువే డిమాండ్ చేస్తోంది. ఆమెకు ఆరు కోట్లు చెల్లించాల్సి ఉంటుంద‌ని ముంబై ఏజెన్సీ జ‌క్క‌న్న‌కు సూచించిందిట‌.  దాంతో నిర్మాతలు షాక్ అయ్యారట. అయితే కరుణ్ జోహార్ సీన్ లోకి వచ్చి ఆ డీల్ కు జ‌క్క‌న్న కు అనుకూలంగా మాట్లాడి ఫైనల్ చేసారని తెలిసింది. అయితే ఇంతకీ ఆమె రామ్ చరణ్ కా లేక ఎన్టీఆర్ కా ...ఎవరికి జోడి అనేది మాత్రం తెలియరాలేదు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.