హీరో హత్యకి కుట్ర... ఉలిక్కిపడిన చలన చిత్ర పరిశ్రమ

First Published 13, Jul 2018, 3:11 PM IST
rowdy sheeter murder attempt on hero yash
Highlights

స్టార్ హీరో యశ్‌ను హత్య చేయడానికి కుట్ర జరిగిందన్న వార్తలతో కన్నడ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. పోలీసు కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న రౌడీ షీటర్ సైకిల్ రవి పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించాడు

స్టార్ హీరో యశ్‌ను హత్య చేయడానికి కుట్ర జరిగిందన్న వార్తలతో కన్నడ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. పోలీసు కాల్పుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న రౌడీ షీటర్ సైకిల్ రవి పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. సినీ నిర్మాత జయణ్ణతో ఓ వివాదం నేపథ్యంలో సైకిల్ రవి హీరో యశ్‌పై కక్ష పెంచుకున్నాడని తెలుస్తుంది. అతనిని చంపేందుకు కుట్ర పన్నామని.. బెంగళూరు సమీపంలో జరిగిన  ఓ మందు పార్టీలో హత్య విషయంపై తామంతా చర్చించుకున్నామని రవి చెప్పాడు..

అయితే ప్లాన్ వేసిన మాట నిజమే కాని.. హత్య వరకు వెళ్లలేదని తెలిపాడు.. కాగా రెండేళ్ల క్రితమే తన హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని హీరో యశ్ బెంగళూరు నగర పోలీస్ కమీషనర్ దృష్టికి తీసుకువెళ్లాడు.. ఈ కేసులో భాగంగా పలువురు రౌడీషీటర్లను అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు రవి తాగిన మత్తులో ఏదో వాగుతున్నాడని.. తాము అతని నుంచి పూర్తి సమాచారాన్ని రాబడుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై హీరో యశ్ స్పందిస్తూ.. ఇది చిన్న విషయమని తాను దీని గురించి పోలీసులకు ఎప్పుడో ఫిర్యాదు చేశానని చెప్పాడు.

 

loader