ఎంతో మంది ఇష్టపడే సాఫ్ట్ డ్రింక్ ‘థమ్స్ అప్’ బ్రాండ్ అంబాసిడర్ గా రౌడీ హీరో ‘విజయ్ దేవరకొండ’ వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు తర్వాత ‘విజయ్’ ఆ స్థానం దక్కించుకోవడం విశేషం.   

45 ఏండ్ల కింద తయారైన సాఫ్ట్ డ్రింక్ ‘థమ్స్ అప్’ ఇంకా దాని ప్రత్యేకతను కోల్పోలేదు. సరికొత్త టెస్ట్ తో ఈ కూల్ డ్రింక్ డిమాండ్ లోనే ఉంది. అయితే తాజాగా థమ్స్ అప్ బ్రాండ్ అబాసిడర్ గా టాలీవుడ్ రౌడీ హీరో ‘విజయ్ దేవరకొండ’ను ఎంపిక చేసుకుంది ఆ సంస్థ. ఈ మేరక్ లైగర్ హీరో విజయ్ తో యాడ్ షూట్ ను కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1990 నుంచి ‘థమ్స్ అప్’ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు ఇండియన్ యాక్టర్స్ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రన్ వీర్ సింగ్, మహేష్ బాబు యాడ్ ఫల్మ్స్ లో నటించారు. అయితే టాలీవుడ్ నుంచి ఇంటర్నేషనల్ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా మొదట మెగాస్టార్ ‘చిరంజీవి’, ఆ తర్వాత సూపర్ స్టార్ ‘మహేశ్ బాబు’ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. తాజాగా ఆ సంస్థ టాలీవుడ్ రౌడీ హీరో క్రేజ్ కు ఫిదా అయ్యింది. తమ థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా ‘విజయ్ దేవరకొండ’ను ఎంపిక చేసుకోంది. ఈ మేరకు యాడ్ ఫిల్మ్ ను కూడా చిత్రీకరించి, రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Scroll to load tweet…

అయితే ‘అర్జున్ రెడ్డి’తో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఐదేండ్లలో మెగాస్టార్, సూపర్ స్టార్ ల రేంజ్ ను బీట్ చేయడం విశేషం. ఇందుకు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు షాక్ అవుతున్నారు. తక్కువ టైమ్ లో అందనంత స్టార్ డమ్ ను సొంత చేసుకున్నాడు విజయ్. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు థమ్స్ అప్ యాడ్ ఫిల్మ్ లోనూ రౌడీ స్టైల్ వేరే లెవల్ ఉంది.

‘థమ్స్ అప్’ అనే బ్రాండ్ నేమ్ విజయానికి సింబల్ గా సూచించేదిగా ఏంచుకున్నారు. ఈ బ్యాండ్ అమెరికన్ కంపెనీ కోకా-కోలా ద్వారా 1977లో థమ్స్ అప్ సాఫ్ట్ డ్రింక్ గా ఇండియాకు పరిచయమైంది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఆ కంపెనీ ఈక్విటీలో 60 శాతం భారతీయ కంపెనీకి విక్రయించింది. అప్పటి నుంచి ఆల్ ఇండియాలో ఈ స్టాఫ్ట్ డ్రింక్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీనికి పోటీగా పెప్సీ వచ్చినా అధిగమించింది ‘థమ్స్ అప్’. ఎప్పటికప్పుడు సరికొత్త మినరల్స్ తో వినియోగదారులను ఖుషీ చేస్తోందీ ఈ సంస్థ.