ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే బ్రాండ్ తెచ్చుకున్న ప్రభుదేవా ఎలాంటి కోరోయోగ్రాఫరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అదే విధంగా దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకున్న అనంతరం అటు యాక్టర్ కూడా బిజీ అయ్యాడు. దీంతో సాంగ్ కంపోజింగ్ అనే పనిని చాలా వరకు ప్రభుదేవా దూరం పట్టేశాడు. 

ఇక రీసెంట్ గా వచ్చిన మారి 2 రౌడీ బేబీ సాంగ్ తో మళ్ళీ తన సత్తా చాటాడు. ప్రభుదేవా. యువన్ శంకర్ రాజా సంగీతం ఎంత బావున్నా.. ధనుష్ - సాయి పల్లవి స్టెప్పులు ఇరగదీసిన కూడా సాంగ్ క్రెడిట్ మొత్తం ఇండియన్ మైకేల్ జాక్సన్ కె చెందాలి. సాంగ్ చుస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సాయి పల్లవి లాంటి హీరోయిన్ నిస్టైలిష్ స్టెప్పులు వేయించేందుకు బాగా ఉపయోగించారు. 

మారి 2 సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ ఏమి రాలేదు. ఇక రౌడీ బేబీ సాంగ్ కి మాత్రం యూ ట్యూబ్ లో కోట్ల వ్యూస్ అందడం విశేషం. 90 మిలియన్ల వ్యూస్ తో పాటు 1 మిలియన్ లైకులు రావడంతో ఈ సాంగ్ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ప్రభుదేవా మ్యాజిక్ ఎన్నేళ్లయినా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని మరోసారి రుజువయ్యింది.