ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న షణ్ముఖ్(shanmukh) నిద్ర లేచాడు.  తనలోని రొమాంటిక్‌ బాయ్‌ని నిద్ర లేపాడు. `హైదరాబాద్‌ అమ్మాయి- అమెరికా అబ్బాయి` టాస్క్ లో షణ్ముఖ్‌ పెళ్లిళ్ల బ్రోకర్‌ గా యాక్ట్ చేశారు. అతని వద్ద ఈవెంట్‌ మేనేజర్‌గా లోబో(lobo), లోబో అసిస్టెంట్‌గా స్వేత వర్మ(sweta varma) నటించారు.  

బిగ్‌బాస్‌5 హౌజ్‌లో.. (biggboss5)షణ్ముఖ్‌(shanmukh) అంటే ఇన్ని రోజులు డీసెంట్‌ అనే పేరు పడింది. కానీ మనోడిలోనూ రొమాంటిక్‌ బాయ్‌ ఉన్నాడనే విషయాన్ని తాజాగా ఆడియెన్స్ కి తెలిసొచ్చింది. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న షణ్ముఖ్ నిద్ర లేచాడు. తనలోని రొమాంటిక్‌ బాయ్‌ని నిద్ర లేపాడు. `హైదరాబాద్‌ అమ్మాయి- అమెరికా అబ్బాయి` టాస్క్ లో షణ్ముఖ్‌ పెళ్లిళ్ల బ్రోకర్‌ గా యాక్ట్ చేశారు. అతని వద్ద ఈవెంట్‌ మేనేజర్‌గా లోబో, లోబో అసిస్టెంట్‌గా స్వేత వర్మ నటించారు. 

వీరి మధ్య వచ్చిన సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు పంచాయి. లోబో ఇష్టపడే స్వేతని గోకడం స్టార్ట్ చేశాడు షణ్ముఖ్‌. శర్మ శర్మ అంటూనే స్వేత వర్మని తన బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. మొత్తానికి ఆమెని తన ట్రాక్‌ లో పడేసుకున్నాడు. లోబో గగ్గోలు పెడుతున్నా, సైలెంట్‌గా తన పని తాను కానిచ్చేశాడు. ఇదిలా ఉంటే షణ్ముఖ్‌, స్వేత వర్మల మధ్య జరిగిన సంభాషణ ఓ రకంగా ఆకట్టుకోగా, మరో రకంగా సీరియస్‌గా మారింది. 

`పెళ్లి చేసుకుందాం, ఇక నుంచి నేను నీ వాడిని, నువ్వు నాదానివి` అని షణ్ముఖ్‌ అనడంతో సిగ్గుతో ముడుచుకుంటూనే సరే అనేసింది శ్వేత. ఆ తర్వాత `నువ్వంటే నాకు పిచ్చి, నువ్వే నా ఊపిరి..` అంటూ లోబో ఐ లవ్‌ యూ చెప్పగా అతడికీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది శ్వేత. ఇది చూసి హర్ట్‌ అయిన షణ్ముఖ్‌.. `ఏదైనా అందామంటే ముఖం మీద పెయింట్‌ వేసి కొడుతుంది` అని నోరు జారాడు. దీంతో ఫీలైన శ్వేత.. `అది ఫన్నీ కాదు` అంటూ ఒక్కసారిగా సీరియస్‌ అయింది. ఆమెను అనవసరంగా బాధపెట్టాననుకున్న షణ్నూ తన నోటి దురదను తిట్టుకుంటూ శ్వేతను బుజ్జగించేందుకు ప్రయత్నించాడు. వాష్‌రూమ్‌ దగ్గర ఉన్న ఆమెను క్షమించమని కోరాడు. ఈ సీన్ సీరియస్‌గా మారిపోయింది.

మరోవైపు సిరి.. తన చిన్ననాటి ఫ్రెండ్‌గా పెళ్లి చేయించమని షణ్ముఖ్‌ వద్దకి వస్తుంది. అప్పుడు కూడా మీకు ఇది చేస్తే నాకేంటి అంటూ గునిగాడు షణ్ముఖ్‌. దీనికి సిరి ఆయన్ని గట్టిగా రెండు మూడు హగ్‌లిచ్చింది. దీంతో మరోసారి సిరి తలని పట్టుకుని హగ్గులు తీసుకున్నాడు షణ్ముఖ్‌. ఏంట్రా ఇదని సిరి అడగ్గా.. చాలా రోజులవుతుందిగా హగ్‌లు లేక అంటూ కామెంట్‌ చేయడం, దీనిక సిరి పంచ్‌లు వేయడం నవ్వులు పూయిస్తుంది. మరోవైపు ప్రియాంక కూడా షణ్ముఖ్‌కి ట్రై చేయగా, ఆమె నుంచి తప్పించుకున్నాడు షణ్ముఖ్‌. మొత్తంగా యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ ఈ ఇన్నాళ్లకు తనలోని నటుడిని బయటకు తీశాడని చెప్పొచ్చు.