ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన రోల్ రైడా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశల్ హౌస్ మేట్స్ అందరినీ ఉద్దేశిస్తూ.. కుక్కల్లా నా మీద పడిపోతుంటారని అన్నారు.

ఆ సమయంలో రోల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. కుక్కలని ఎలా అంటారంటూ కౌశల్ పై అసహనం వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తి కౌశల్ గురించి పాజిటివ్ గా మాట్లాడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కౌశల్ ఓ మంచి గేమ్ ప్లేయర్ అంటూ అతడికి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఆట గెలవాలనే లక్ష్యంతో ఆయన వచ్చాడని, దానికి తగ్గట్లే గేమ్ ఆడుతున్నాడని రోల్ వ్యాఖ్యానించాడు.

మీ ఎగ్స్ జాగ్రత్త టాస్క్ లో ఆయన నాకు మద్దతు ఇవ్వడం సంతోషాన్నించిందని రోల్ అన్నారు. కౌశల్ తో తనకు మంచి రిలేషన్ ఉందని అన్నారు. కౌశల్ ఎప్పుడూ తనను స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ టాప్ 5 లో ఉంటావని ఎంకరేజ్ చేసేవాడని రోల్ చెప్పుకొచ్చాడు. తాను ఎలిమినేట్ అయినప్పుడు కూడా కౌశల్ ఆశ్చర్యపోయాడని, అసలు ఊహించలేదని బాధ పడ్డారని రోల్ వెల్లడించాడు.