ఎన్టీఆర్ అంటే ప్రాణం...అన్నను ఏమైనా అంటే ఊరుకునేది లేదు అంటున్నాడు స్టార్ కమెడియన్ రోలర్ రఘు. తారక్ తో తన స్నేహాన్ని గుర్తు చేసుకున్న రఘు.. అన్న కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్నాడు.
టాలీవుడ్ లో కమెడియన్ గా స్టార్ ఇమేజ్ సాధించాడు రోలర్ రఘు. ఎన్టీఆర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సాధించాడు రఘు. తెలంగాణ యాసలో ఆయన డైలాగ్ డెలివరీ స్పెషల్ ఇమేజ్ ను సాధించి పెట్టింది రఘుకి. ఇక ఎక్కువ కాలం జూనియర్ ఎన్టీఆర్ తో ట్రావెల్ చేసిన రోలర్ .. కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆర్ధికంగా కొన్ని దెబ్బలు తగిలినా.. మళ్లీ పైకి లేచాడు రఘు.. బిజినెస్ లు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
అయితే రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ స్టార్ కమెడియన్.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు ప్రస్తావించారు.అప్పట్లో ఎన్టీ రామారావుగారు .. ఆ తరువాత బాలకృష్ణగారు .. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే నాకు ప్రాణం. ఆయన కోసం ఏం చేయడానికైనా నేను రెడీ అన్నారు రఘు. ముందు నుంచి తారక్ తో మంచి సాన్నిహిత్యం ఉందని.. అయితే పెళ్ళికి ముందు వరకూ తారక్ తో కలిసి బయట బాగా తిరిగేవారమన్నారు. అప్పుడు టైమ్ ఎలా గడిచిపోయేదో కూడా తెలియదన్నారు రఘు.
ఇక ఆతరువాత ఎన్టీఆర్ కు పెళ్ళి అవ్వడం.. ఫ్యామిలీ లైఫ్ లో ఆయన బిజీ అవ్వడం.. ఇటు సినిమాలు, తారక్ కు టైమ్ లేకుండా పోుయింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోవడంతో.. బయట తిరిగే అవకాశం లేదన్నారురఘు. కాని అప్పటికీ ఇప్పటికీ.. ఎన్టీఆర్ తన స్నేహితులను కూడా కుటుంబసభ్యుల మాదిరిగానే చూసుకుంటారు. నేను ఆయనను పెద్దన్నయ్య అని పిలుస్తాను అన్నారు రఘు.
ఇక సినిమాలకు దూరంగా ఉంటున్న రఘు..ఎన్టీఆర్ సినిమాల్లో ఎందుకు నటించడంలేదు అని ప్రశ్నించగా.. తన సినిమాల్లో మేము చేసే పాత్రలేమైనా ఉంటే మాకు వస్తాయి. అంతేగానీ ఫలానా పాత్రలో మా ఫ్రెండును పెట్టుకోమని ఆయన సిఫార్స్ చేయరు. పాత్రకి తగిన నటులు ఉండాలనేదే ఎన్టీఆర్ అభిప్రాయం అని అన్నారు రఘు. ఇక ఏ ఫ్రెండ్ తోనూ ఆయనకి ఎలాంటి మనస్పర్థలు రాలేదు ముందు ముందు రావు కూడా అని క్లారిటీ ఇచ్చారు రఘు. ఇక ప్రస్తుతం రఘు కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
