యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఫైర్ బ్రాండ్ రోజా బర్త్ డే విషెస్.. క్రేజీ పిక్ షేర్ చేస్తూ..
బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రభాస్ నేడు తన 44వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.

బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆరడుగుల కటౌట్ తో ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించే అభిమానుల్లో ఉప్పొంగే ఎనర్జీ లెవెల్స్ వేరుగా ఉంటాయి. టాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్స్ కి ధీటుగా పోటీ పడడం ప్రభాస్ కే సాధ్యమైంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి 2898 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రాలతో ప్రభాస్ హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా కల్కి చిత్రంతో తెలుగు సినిమా స్టాండర్ట్స్ ఇంటర్నేషనల్ స్థాయిని అందుకుంటాయి అని అంటున్నారు. ఇటీవల విడుదలైన కల్కి టీజర్ ఆ రేంజ్ లోనే పేలింది. ఇదిలా ఉండగా ప్రభాస్ నేడు తన 44వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తో హోరెత్తిస్తున్నారు.
ప్రభాస్ కి ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్, ఏపీ మంత్రి రోజా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రభాస్ తో ఉన్న ఫోటో షేర్ చేసిన రోజా ఈ విధంగా కామెంట్స్ చేసింది. 'ప్రియమైన ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నా' అని రోజా ట్వీట్ చేశారు. తన కొడుకుతో కలసి ప్రభాస్ ని గతంలో కలసిన ఫోటో రోజా షేర్ చేశారు.
రోజా ప్రస్తుతం ఏపీలో టూరిజం శాఖా మంత్రిగా కొనసాగుతున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన సెలెబ్రెటీల్లో రోజా కూడా ఒకరు. అయితే ఇటీవల రోజా చిత్ర పరిశ్రమ గురించి చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే.