Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉంది. మనసులో మాట బయటపెట్టిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్

అల్లు అర్జున్ తో సినిమాచేయాలని ఉంది అంటూ తన కోరికను బయట పెట్టారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఇంతకీ బన్నీతో ఎప్పుడు సినిమా చేయబోతున్నారు. 
 

Rohit Shetty Wants To Do A Film With Allu Arjun
Author
First Published Dec 3, 2022, 10:17 AM IST

పుష్ప తరువాత అల్లు అర్జున్ కు పాన్ ఇండియా రేంజ్ లో డిమాండ్ పెరిగిపోయింది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బన్నీకి మార్కెట్ పెరిగిపోయింది.  ఇటు టాలీవుడ్ దర్శకులతో పాటు.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా బన్ని సినిమాతో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉంది అంటూ... తన మనసులో మాట బయట పెట్టాడు. 

ఇక బన్నీతో కలిసి సినిమా చేయడం తనకు చాలా ఇష్టం అన్నారు బాలీవుడ్ స్టార్ దర్శకుడు రోహిత్ శెట్టి. ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు తెరకెక్కించిన రోహిత్ శెట్టి.. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉన్నారు.  ప్రస్తుతము ఆయన తెరకెకక్కించిన  సర్కస్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. తాజాగా సర్కస్ సినిమా ట్రైలర్ ని మూవీటీమ్ రలీజ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న రోహిత్ శెట్టి సౌత్ హీరోస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. 

తనకు సౌత్ హీరోస్ కొంత మంద అంట చాలా ఇష్టం అన్నారు రో్హిత్..  అజిత్ కుమార్, అల్లు అర్జున్, కార్తీలతో కలిసి  పని చేయడం ఇష్టం అన్నారు.  ముగ్గురు హీరోలతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతీ హీరోతో కలిసి సినిమాలు చేయడం తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. అజిత్, విజయ్, అల్లు అర్జున్, కార్తీతో పాటు అందరితో కలిసి పని చేయడం ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు రోహిత్ శెట్టి.

ఇక బన్నీపై కూడా స్సెషల్ గా ప్రస్తావించిన ఆయన.. అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం అటున్నాడు రోహిత్ శెట్టి. ఇక పుష్పను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు ఈ మూవీ టీమ్. రిలీజ్ అయిన ఏడాదికి రష్యాలో ఈ సినిమాను రిలీజ్ చేయడం కోసం అక్కడికి వెళ్లారు టీమ్. అక్కడ పుష్పటీమ్  చేస్తున్న సందడి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్ వైరల్ అవుతూనే ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios