Asianet News TeluguAsianet News Telugu

భార్యని వీడియోలో చూసే ఛాన్స్ వదులుకుని వెక్కి వెక్కి ఏడ్చిన రేవంత్.. రోహిత్ నేరుగా రెండు వారాలు నామినేట్

టెలిఫోన్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొత్త చిక్కు పెట్టారు. ముందుగా సూర్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. దీనితో బిగ్ బాస్ సూర్యకి ఇంటి బ్యాటరీ పెంచుకునే అవకాశం ఇస్తాడు. 

rohit gets 2 weeks nomination in telephone task
Author
First Published Oct 13, 2022, 10:49 PM IST

బాలాదిత్య ఎమోషనల్ కామెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ 40 మొదలైంది. సుదీప.. బాలాదిత్యని ఓదార్చడానికి ప్రయత్నించింది. టెలిఫోన్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొత్త చిక్కు పెట్టారు. ముందుగా సూర్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. దీనితో బిగ్ బాస్ సూర్యకి ఇంటి బ్యాటరీ పెంచుకునే అవకాశం ఇస్తాడు. 

దీనికి బిగ్ బాస్ ఒక నిబంధన పెడతారు. రోహిత్, వాసంతి లలో ఒకరిని తర్వాతి రెండు వారాలకు డైరెక్ట్ గా నామినేట్ అయ్యేలా ఒప్పిస్తే ఇంటి బ్యాటరీ 100 శాతం పెరుగుతుందని చెబుతాడు. బిగ్ బాస్ పెట్టిన కండిషన్ ని సూర్య.. రోహిత్, వసంతిలకి వివరిస్తాడు. దీనితో వాసంతి, రోహిత్ చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తారు. రోహిత్ నామినేట్ అయ్యేందుకు అంగీకారం చెబుతాడు. 

దీనితో ఇంటి బ్యాటరీ 100 శాతం పెరుగుతుంది. అప్పటి నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఎవరు ముందుగా లిఫ్ట్ చేస్తే వారికి బిగ్ బాస్ కొన్ని అవకాశాలు ఇస్తారు. ముందుగా రేవంత్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. తన భార్య వీడియో పొందేందుకు 20 శాతం బ్యాటరీ ఖర్చువుతుందని, ఫోటోకి 10 శాతం ఖర్చవుతుందని బిగ్ బాస్ చెబుతారు. దీనితో ఇతర సభ్యులకు కూడా బ్యాటరీ మిగిలేందుకు రేవంత్ త్యాగం చేస్తారు. ఫోటో ఆప్షన్ ఎంచుకుంటాడు. 

కానీ తన భార్యని వీడియోలో చూడలేకపోయానని రేవంత్ అన్నం తింటూ కన్నీరు పెట్టుకోవడం ఎమోషల్ గా మారుతుంది. ఇంటి సభ్యులు అతడిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఫైమా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. 25 శాతం బ్యాటరీతో అమ్మతో వీడియో కాల్.. 20 శాతం బ్యాటరీతో లక్కీ నుంచి ఆడియో మెసేజ్ అవకాశం వస్తుంది. 

5 శాతం మాత్రమే తేడా ఉండడంతో ఫైమా అమ్మతో వీడియో కాల్ ఆప్షన్ ఎంచుకుంటుంది. ఫైమా తన తల్లితో సంతోషంగా మాట్లాడుతుంది. కీర్తి, సూర్య కూడా ఫోన్ అవకాశం పొందుతారు. సూర్య తన తల్లి రాసిన లేఖని అందుకునే ఆప్షన్ ఎంచుకుంటాడు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ సూర్య ఎమోషనల్ కావడం.. అతడిని ఇనాయ ఓదార్చడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇక చివర్లో బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారులుగా అర్హత సాధించే టాస్క్ పెడతారు. 

ఈ టాస్క్ లో బంతులని బుట్టలో వేయాలి. ముందుగా వేసిన మొదటి 8 మంది కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. ఈ టాస్క్ లో రేవంత్, వాసంతి, ఆది రెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ విజయం సాధించి కెప్టెన్సీ పోటీదారులుగా అర్హత సాధిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios