పూరి జగన్నాథ్  ఆ మధ్యన చేసిన వరస ఫ్లాఫ్ చిత్రాల్లో ఒకటి రోగ్. 2017లో వచ్చిన ఈ చిత్రంలో హీరోగా ఇషాన్ పరిచయం అయ్యారు. ఈ కుర్రోడుకు ఈ సినిమాలో నటుడుగా మంచి పేరే వచ్చింది కానీ సినిమా డిజాస్టర్ కావటంతో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు ఇషాన్ ని తన సినిమా ద్వారా మళ్లీ బ్రేక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు అజయ్ భూపతి.

ఒక డిజాస్టర్ సినిమా చేసి ఖాళీగా ఉన్న కార్తీకేయను RX 100 సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ చేసారు అజయ్ భూపతి. అదే పద్దతిలో ఇషాన్ ను సైతం డిఫరెంట్ చూపబోతున్నారని తెలుస్తోంది. అయితే విలన్ గా ఇషాన్ ని చూపించబోతున్నారట. అదీ రవితేజతో తాను చేయబోయే చిత్రంలో అంటున్నారు.

తన డ్రీమ్ ప్రాజెక్టు మహా సముద్రం ని తెరకెక్కించాలని హీరోల చుట్టూ తిరుగుతున్నారు అజయ్ భూపతి. అయితే ప్రతీసారి ప్రాజెక్టు ఓకే అవటం , ఆగిపోవటం జరుగుతోంది. ఇప్పుడు రవితేజతో ఈ సినిమాని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. అందుకోసం ఓ పవర్ ఫుల్ విలన్ కావాలని ఇషాన్ ని సీన్ లోకి తీసుకొస్తున్నారట. ఇప్పడు చాలా మంది యంగ్ హీరోలు, బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు అజయ్ భూపతి చుట్టూ ఒక్క ఛాన్స్ అని తిరుగుతున్నారట. మరి ఈ సినిమాతో అయినా ఇషాన్ కు బ్రేక్ వస్తుందేమో చూడాలి.