పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ ప్రేమకథా చిత్రాల్లో ట్రెండ్ సెట్ చేస్తుందంటున్న పూరీ 

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇషాన్ అనే కొత్త కుర్రాడిని పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం రోగ్. తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో ఇషాన్ సరసన మన్నార చోప్రా, ఏంజెలా క్రిస్లిన్కి కథానాయికలుగా నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన చిత్రంలోని పాటలను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా రోగ్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుంది. సెన్సార్ బోర్డు యూ/ఏ అనే సర్టిఫికెట్ ఇచ్చింది. చిత్రాన్ని మార్చి 31న విడుదల చేస్తున్నట్టు టీం ప్రకటించింది. అయితే ఇదే రోజు నయనతార డోర కూడా విడుదల కానుంది.ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి.

ఇప్పటికే పూరీ తెరకెక్కించిన చిత్రం కావడంతో రోగ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆడియో సక్సెస్ ఇచ్చిన జోష్ తో పూరీ టీమ్ మాంచి ఎనర్జీతో ఉంది. ఇక ఇడియట్ సినిమా కంటే మాంచి హిట్ అవుతుందని దర్శకుడు పూరీ అంటున్నారు. సో రోగ్స్.. గెట్ రెడీ.