Asianet News TeluguAsianet News Telugu

కెమెరా ముందు కొడితే బాగోదు.. భార్య జోర్దార్ సుజాత చేసిన పనికి రాకింగ్ రాకేష్ సిరీస్... 


జోర్దార్ సుజాత పై రాకింగ్ రాకేష్ కి కోపం వచ్చింది. కెమెరా లేకుంటే నా రియాక్షన్ వేరుగా ఉండేది అంటూ... ఫైర్ అయ్యాడు. ఇంతకీ జోర్దార్ సుజాత చేసిన తప్పేంటో చూద్దాం... 
 

rocking rakesh fires on wife jordar sujatha this is the reason ksr
Author
First Published Feb 14, 2024, 6:26 PM IST | Last Updated Feb 14, 2024, 6:26 PM IST

తెలంగాణ మాండలికం లో వార్తలు చదువుతూ జోర్దార్ సుజాతగా పాప్యులర్ అయ్యింది సుజాత. ఈమె బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. అయితే ఆశించిన స్థాయిలో రాణించలేదు. కొద్ది వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది. అనంతరం జబర్దస్త్  కమెడియన్ గా మారింది. ఈ క్రమంలో టీమ్ లీడర్ రాకింగ్ రాకేష్ తో అనుబంధం ఏర్పడింది. అసలు పెళ్లి చేసుకోకూదనుకున్న రాకేష్ మనసు మార్చేసింది. అతన్ని ప్రేమలో దించింది. 

జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేశ్ వివాహం చేసుకున్నారు. వీరి సంసారం సవ్యంగా సాగుతుంది. ఇద్దరూ జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు. పెళ్ళై ఏడాది అవుతున్న సందర్భంగా సుజాత భర్త రాకేష్ కి ఓ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. రాకేష్ కి తెలియకుండా ఒక ఖరీదైన ఫ్లాట్ కొన్నది. స్వయంగా ఆ ఇంటికి తీసుకెళ్లి... ఈ ఇల్లు నేనే కొన్నాను. ఈ పేరున రిజిస్టర్ చేయించానని షాక్ ఇచ్చింది. 

దాంతో రాకేష్ మైండ్ బ్లాక్ అయ్యింది. నువ్వు చాలా అభివృద్ధి చెందావని ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంతలోనే ఆశలు ఆవిరి చేస్తూ... ఇదంతా ఫ్రాంక్. ఇది మన ఇల్లు కాదు వేరొకరిదని చెప్పింది. దాంతో రాకేష్ అసహనానికి గురయ్యాడు. ఇలాంటి ఇల్లు భవిష్యత్ లో కొంటే నీకు ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలో ఫ్రాంక్ చేసి చూపాను అని జోర్దార్ సుజాత అన్నది. 

నేను కూడా ఫ్రాంక్ లు చేశా కానీ ఇలాంటి ఫ్రాంక్ లు కాదు. అమ్మో నువ్వు మహానటి సావిత్రి రేంజ్ లో పెర్ఫార్మ్ ఇచ్చావు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. మళ్ళీ నువ్వు  ఇలాంటి ఫ్రాంక్ లో చేస్తే ఎలా కొడతానో చూపించనా.. కెమెరా ముందు కొడితే బాగోదు... అని తన కోపాన్ని రాకేష్ అణచుకున్నాడు. బహుశా అంత లగ్జరీ ఇల్లు నిజంగా సుజాత కొన్నదని రాకింగ్ రాకేష్ మెంటల్ గా ఫిక్స్ అయి ఉండొచ్చు. ఈ వీడియో సుజాత తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios