రోబో 2.0 హక్కులపై కోట్ల రిస్క్ గతంలో రోబో రైట్స్ 27 కోట్లు ఇప్పుడు రోబో 2.0 రైట్స్ 81 కోట్లు
శంకర్ - రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 2.0. 2010లో వీరి కాంబోలో వచ్చిన రోబో సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత ఖరీదైన చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్‌కు మరో ఐదు నెలల టైం ఉండగానే ఈ క్రేజీ ప్రాజెక్టు అప్పుడే హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్, శాటిలైట్, ఇంటర్నెట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడవుతున్నాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్‌ను నిర్మాతలు లైకా ప్రొడక్షన్ వారు ఎప్పుడో విక్రయించేశారు.
లైకా సంస్థ తెలుగు రైట్స్ గ్లోబల్ సినిమాస్‌కు అమ్మితే ఇప్పుడు ఆ రైట్స్ చేతులు మారాయి. ఈ హక్కులు ఇప్పుడు ఏషియన్ ఫిలింస్ వాళ్లు కొన్నారు. ఏకంగా రూ. 81 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడయ్యాయి. రోబో రైట్స్ అప్పట్లోనే రూ. 27 కోట్లకు అమ్మారు. శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్ కాకుండా ఏపీ, తెలంగాణ రైట్స్ వరకు ఈ రేటు అంటే ఇండియాలోనే పెద్ద రికార్డుగా చెప్పుకోవాలి.
ప్రింట్ ఖర్చులు కూడా కలుపుకుని రూ. 85 కోట్ల షేర్ వస్తేగాని వీళ్లు సేఫ్ అవ్వరు. మరి ఈ ప్రాజెక్టుపై ఏషియన్ ఫిలింస్ చేసిన బిగ్ రిస్క్ ఎంత వరకు ఫలిస్తుందో ? చూడాలి. 2017 జనవరి 25న రోబో 2.0 రిలీజ్ కానుంది.
