వరల్డ్ వైడ్ గా అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా బారి ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ సినిమా క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు. ఇప్పటికే 8000 కోట్ల కలెక్షన్స్ ను అవెంజర్స్ దాటేసింది. అయితే సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ ఈ సినిమాకోసం భారీ పారితోషికాన్ని అందుకున్నాడు. 

రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ ఐరెన్ మ్యాన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దాదాపు అవెంజర్స్ అన్ని సిరీస్ లలో రాబర్ట్ మెయిన్ లీడ్ లో కనిపించాడు. అయితే ఎండ్ గేమ్ కోసం రాబర్ట్ సుమారు 524 కోట్ల (75 మిలియన్ల డాలర్లు) రెమ్యునరేషన్ ని అందుకున్నాడట. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా కలెక్షన్స్ నుంచి వాటా రూపంలో ఈ భారీ ఎమౌంట్ రాబర్ట్ కి అందినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక సినిమాకు 500 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమనేది చాలా రేర్. హాలీవుడ్ లో కొంత మంది మాత్రమే ఈ రేంజ్ లో పారితోషికాన్ని తీసుకుంటారు. ఇక ఇప్పుడు ఐరెన్ మ్యాన్ రాబర్ట్ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయారు.