నటసింహం బాలకృష్ణ ఇంటిముందు నిన్న హడావిడి జరిగింది. ఒ కారు బాలయ్య ఇంటిమీదకు దూసుకురావడంత అంతా గందరగోళం ఏర్పడింది. ఇంతకీ ఏవరిదా కారు..?

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో హీరో బాలకృష్ణ ఇంటిముందు ఓ జీపు వల్ల గందరగోళం ఏర్పడింది. ఓ జీపు అదుపుత‌ప్పి గేట్‌వైపు దూసుకెళ్లిన‌ ఘ‌ట‌న జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 25లో చోటుచేసుకుంది. కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న‌ ఓ యువ‌తి. బాలకృష్ణ ఇంటుముందుకు దూసుకు వచ్చింది. దాంతో అంతా కంగారు పడ్డారు. చివరికి ఆ కారు నడిపింది ఓ అమ్మాయి అయి తేలింది. 

అయితే అంబులెన్స్ వ‌స్తుంద‌ని దారి ఇవ్వ‌బోయి ఇలా జరిగనట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో కారు అదుపు త‌ప్ప‌డంతో డివైడ‌ర్ ఎక్కి..ఆ ప‌క్క‌నే ఉన్న సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ఇంటి గేట్ వైపుకు దూసుకెళ్లింది. దాంతో అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులతో పాటు బాలయ్య గేటు సెక్యూరిటీవారు కూడా కంగారు పడ్డారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎలాంటి ప్ర‌మాదం జ‌రుగ‌లేదు

ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు స‌ద‌రు యువ‌తికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌లో ఆ యువ‌తి ఆల్కాహాల్ ఏం తీసుకోలేద‌ని నిర్దార‌ణ అయింది. పోలీసులు ఆ వాహ‌నాన్ని బ‌య‌ట‌కు తీశారు. అయితే ఈ సంఘటనతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో పోలీసులు వాహ‌న‌దారుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.