Asianet News TeluguAsianet News Telugu

“కాంతారా” కి రిషబ్ శెట్టి షాకింగ్ రెమ్యునరేషన్, అంత తక్కువా?


ఈ ఏడాది రిలీజైన కేజీఎఫ్-2, చార్లీ 777 తర్వాత కన్నడలో విశేష ప్రేక్షకాదరణ పొందింది ‘కాంతార’.కన్నడ భాషలో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.  

Rishab Shocking Remuneration For Kantara
Author
First Published Dec 21, 2022, 3:00 PM IST


 
‘కేజీఎఫ్‌’ మూవీ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ‘హోంబలేఫిల్మ్‌’ సంస్థ నిర్మించిన మరో పాన్‌ ఇండియా చిత్రం ‘కాంతారా’. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. విజయ్‌ కిరగందూర్‌ నిర్మాత. ఇటీవలె కన్నడలో విడుదలై ఘన విజయం అందుకున్న ఈ చిత్రం తెలుగు హక్కులను నిర్మాత అల్లు అరవింద్‌ సొంతం చేసుకున్నారు. ఈ నెల 15న విడుదల చేసారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది.  దాదాపు 16 కోట్లుతో తీసిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 406 కోట్లు దాక వసూలు చేసింది.  ఈ సినిమాకు రిషబ్ శెట్టికు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారనేది ఆసక్తి కరమైన విషయం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... ఈ సినిమాలో హీరో గా  చేస్తూ డైరక్ట్ చేసినందుకు నాలుగు కోట్లు మాత్రమే చెల్లించారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత పెద్ద హిట్ అయ్యింది కానీ మొదట అది 16 కోట్లు బడ్జెట్ తో సినిమా తీస్తున్నప్పుడు అనుకున్నది అని గుర్తించాలి. ఇక ఈ సినిమా ఈస్దాయి హిట్ అయ్యిన తర్వాత సాధారణంగా నిర్మాతలు ....ఆ హీరో లేదా దర్శకులకు మంచి గిప్ట్ లు ఇస్తారు. ఎమౌంట్  ఇస్తారు. కానీ ఆ తర్వాత అలాంటి వార్తలేమీ రాలేదు.

ఇక ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా చేసిన కిషోర్ , హీరోయిన్ సప్తమి గౌడ్ లకు తలో కోటి ఇచ్చారు. విలన్ గా చేసిన అచ్యుత్ కుమార్ కు 40 లక్షలు ఇచ్చారు. సుధారక గా చేసిన మరో నటుడు ప్రమోద్ శెట్టి కు అరవై లక్షలు ఇచ్చారు.
 
ఇక ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “కాంతారా” సినిమాను రిలీజ్ చేసారు.”కాంతారా” అంటే సంస్కృత భాషలో అడవి.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.... అటవీ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప’ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అడవి నేపథ్యంలో తెరకెక్కిన ‘కాంతారా’ సినిమా కూడా ఆ స్థాయిలో అలరించింది.  వైవిధ్యమైన సినిమాలు చూడాలనుకునేవారికి ‘కాంతారా’నచ్చింది. 40 నిమిషాల పాటు సాగే పతాక సన్నివేశాలు కట్టిపడేశాయి. రిషబ్‌శెట్టి దర్శకత్వం, నటన అద్భుతంగా ఉన్నాయి’ అన్నారు. 

రిషబ్‌శెట్టి మాట్లాడుతూ ‘అడవులు, సాగుభూములు నేపథ్యంలో సాగే మిస్టరీ కథ ఇది. కన్నడలో మంచి స్పందన దక్కింది.  ’ అన్నారు. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన చిత్రం ఇది.
 

Follow Us:
Download App:
  • android
  • ios