సైలెంట్ గా వచ్చి  సెన్సేషన్ క్రియేట్ చేసింది కన్నడ సినిమా కాంతార.  దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈసినిమాకు త్వరలో ప్రీక్వెల్ మూవీ తెరకెక్కబోతోంది. 

కన్నడ నాట నుంచి సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి సినిమాలు. కెజియఫ్ స్పూర్తిత కాంతార లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాయి. మరీ ముఖ్యంగా గత ఏడాది విడుదలయి... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాంతార సినిమా. దక్షిణ కన్నడ సంస్కృతిలో భాగమైన భూతకోల నేపథ్యాన్ని కథగా తీసుకుని తెరకెక్కిన ఈసినిమా ఆడియన్స్ లో ప్రత్యేక ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. డివోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన కాంతార మూవీ రిలీజ్ అయిన అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ తో పాటు.. అదిరిపోయే కలెక్షన్స్ ను కూడా సాధించింది. 

దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ నుసాధించింది కాంతారా మూవీ. ఇక ఈసినిమాకు సెకండ్ పార్ట్ మూవీని కూడా తెరకెక్కిచడానికి రెడీ అయ్యారు హీరో,డైరెక్టర్ రిషబ్ శెట్టి. కాంతార సినిమాకు ప్రీక్వెల్ మూవీని తెరకెక్కించబోతున్నారు. కాంతార సినిమాకు ముందు జరిగిన భాగాన్ని ఈసినిమాలో చూపించబోతున్నారు మేకర్స్. అయితే ఈసినిమా షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు జరిగినట్టు తెలుస్తోంది. షూటింగ్ కూడా ఆగస్ట్‌ 27న మొదలుకానుందని సమాచారం.

కాంతార ప్రీక్వెల్‌ మూవీ చాలాప్రత్యేకం కానుంది. ఈ భాగం సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టనున్నారు మూవీ టీమ్. ముఖ్యంగా హీరో , దర్శకుడు రిషభ్ శెట్టి.. సినిమాను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని నిర్ణయించారట. ఈసారి ఒకేసారి పాన్ ఇండియా వైడ్ గా సినిమా రిలీజ్ కాబోతుండటం .. బడ్జెట్ కూడా భారీగా పెట్టబోతుండగా.. ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారట టీమ్. హీరో రిషబ్‌శెట్టి ఈసినిమా కోసం గుర్రపుస్వారీతో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ పొందబోతున్నారని చెబుతున్నారు. 

ఇక ఈ రెండో భాగంలో భూతకోల, పంజుర్లి దైవారాధన పుట్టుపూర్వోత్తరాలను..సంస్కృతిపరమైన ప్రాధాన్యతను ఆవిష్కరించబోతున్నారని సమాచారం. మొదటిభాగానికి పాన్‌ ఇండియా స్థాయిలో దక్కిన ఆదరణ దృష్ట్యా ప్రీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక హంగులను మేళవించి తెరకెక్కించబోతున్నారని తెలిసింది.