బాలీవుడ్ వల్లే ఇండియా పేరు పోతోంది.. రిషబ్ శెట్టి సంచలన కామెంట్స్..

రీసెంట్ గానే నేషనల్ అవార్డ్ సాధించాడు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి. కాంతార సినిమాతో ఫేమస్అయిన ఈ నటుడు.. తాజాగా బాలీవుడ్ మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 

Rishab Shetty Bold Comments on Bollywood: Is It Undermining Indian Cinema JMS

‘కాంతార  సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే..? ఈసినిమాతో  టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు కన్నడ హీరో  రిషబ్‌​శెట్టి . ఈసినిమాలో కాంతారగా యాక్ట్ చేయడంతోపాటు.. ఈమూవీని డైరెక్ట్ చేసింది కూడా రిషబ్ శెట్టినే. ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ తెరకెక్కించిన కాంతార రిలీజ్ చేసిన అన్ని భాషల్లో భాక్సాఫీస్‌ బ్లాస్టింగ్ కలెక్షన్స్ ను సాధించింది.  కన్నడతో పాటు తెలుగు,తమిళ,హిందీ భాషల్లో కూడా సంచలన సృష్టించింది సినిమా. 

ఇక ఈమూవీలో కాంతార గెటప్ లో నటనకుగాను రిష‌బ్ షెట్టి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ కూడా సాధించాడు. అంతే కాదు ఈ మూవీ  ఉత్తమ ప్రేక్షక ఆదరణ అందించిన చిత్రంగా కాంతార నిలిచింది. దీంతో రిషబ్‌ శెట్టిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని బాలీవుడ్ చాలా చులకనగా చూసేది.  సినిమా తీయ్యడం మాకుమాత్రమే వచ్చుఅన్నట్టుగా ఉండేవారు బాలీవుడ్ జనాలు. ఈక్రమంలో సౌత్ సినిమా ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధిస్తోంది. రాజమౌళి వేసిన ముందడుగుతో.. ప్రతీ భాష నుంచి అద్భుతమైన సినిమాలు బయటకు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీపై  కాంతార హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతదేశాన్ని బాలీవుడ్‌ చిత్రాలు తక్కువ చేసి చూపిస్తున్నాయన్నారు. ఇటీవలే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ..  ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినిమాలు అద్బుతాలు చేయగలవు.. కాని బాలీవుడ్‌ సినిమాలు మాత్రం ఇండియాను చాలా తక్కువ చేసి చూపిస్తున్నాయి. 

బాలీవుడ్ సినిమాలు తప్పించి ఇతర భాషల సినిమాలు వారు పట్టించుకోరు.. కళాత్మక చిత్రాలను గ్లోబల్‌ ఈవెంట్‌లకు ఆహ్వానిస్తారు. రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతారు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష.. వీటన్నింటి గురించి సానుకూలంగా ఎందుకు చూపించకూడదు..? దేశం గర్వపడేలా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నాను. నా సినిమాల ద్వారా భారతదేశాన్ని పాజిటివ్‌ నోట్‌లో చూపించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు. రిషబ్‌ శెట్టి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాని ఈ విషయంలో రిషబ్ శెట్టి.. విమర్శలను ఫేస్ చేస్తున్నారు. నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios