తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలు సాధించిన  బెంగాల్ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్... చేతిలో సినిమాలు లేకపోయినా జనం అయితే మర్చిపోలేదు.  సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమెకు తాజాగా నిశ్చితార్దం జరిగింది.   Joe Langella అనే ఫారినర్ ని  ఆమె వివాహం చేసుకుంటోంది.  వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు.  ఈ నిశ్చితార్ద విషయాన్ని ఆమె ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు తెలియచేసింది.

రానా ని హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల రూపొందించిన లీడర్ సినిమాతో 2010లో తెలుగు సినీరంగంలో ప్రవేశించింది రిచా గంగోపాధ్యాయ్.  మిరపకాయ,మిర్చి, భాయ్ వంటి చిత్రాల్లో నటించిన  ఆమె తన గ్లామర్‌తో, నటనతో దక్షిణాదిన ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించింది. 

2005 నుంచి అందాల పోటీల్లో పాల్గొంటూ వచ్చిన ఆమె... మిస్ ఇండియా యుఎస్ఎ పోటీల్లో ఆమె టాప్ టెన్‌గా నిలిచింది. మిస్ మిచిగాన్, మిస్ ఇండియా యుఎస్ఎగా ఎన్నికైంది. మిస్ ఫొటోజెనిక్‌ టైటిల్‌ను కూడా సంపాదించుకుంది. రిచా అమెరికా నుంచి 2008లో ముంబైకి చేరుకుంది.

సినిమాల్లో చేరాలనే ఉద్దేశంతో ఆమె ఇక్కడికి వచ్చింది. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో డిప్లమా తీసుకుంది. ఆ తర్వాత మోడలింగ్ చేయడం మొదలు పెట్టింది. వాటిక ఆల్మోండా హెయిర్ ఆయిల్, పీటర్ ఇంగ్లాండ్, మలబార్ గోల్డ్, కళానికేతన్ వంటివాటికి మోడలింగ్ చేసింది. 

హఠాత్తుగా తన సినిమా జీవితానికి బ్రేక్ ఇచ్చి...అమెరికాకు చదువుకోవటానికి వెళ్లిపోయింది. అక్కడ ఆమె ఎంబీఎ పూర్తి చేసింది.