బాలీవుడ్ లో ఓ పెద్ద యుద్దమే జరుగుతోంది. ఒకరిపై మరొకరు రకరకాల ఆరోపణలు చేసుకుంటున్నారు. కౌంటర్స్ ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సినీ నటి పాయల్ ఘోష్  ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, సినీనటి రిచా చద్దా తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు తనతో లైంగిక సంబంధాలున్నాయని అనురాగ్ గతంలో చెప్పినట్టు పాయల్ తెలిపింది. దీనిపై రిచా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

పాయిల్ నిరాధారంగా... తన పేరును వాడడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది. అనురాగ్‌పై లైంగిక ఆరోపణల చేస్తూ అనవసరంగా తన క్లయింట్‌ రిచా పేరును ప్రస్తావించారని,  అవమానకర రీతిలో వాడారని ఆమె లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు.

 అనవసర వివాదంలోకి రిచా పేరును లాగి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని చెప్పారు. ఇతర మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే చర్యలు సరికావని, ఆ హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఈ విషయంపై తాము  న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. 

ఈ విషయాన్ని డాక్యుమెంట్ చేసిన రిచా లీగల్ టీమ్ ...పాయిల్ ఇంటికి వెళ్లి హార్డ్ కాపీ నోటీసు ఇచ్చే ప్రయత్నం చేసారు. అయితే పాయిల్ తీసుకోవటానికి నిరాకరించింది. దాంతో ఓ సాప్ట్ కాపీని ఆమె పేరుపై పంపారు.