MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Valentines Day Release Movies: ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలివే.. లవర్స్ కి పండగే

Valentines Day Release Movies: ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలివే.. లవర్స్ కి పండగే

Valentines Day Release Movies: ప్రేమికుల రోజు సందర్భంగా ఈ వీక్‌లో పలు లవ్‌ స్టోరీస్‌ విడుదలవుతున్నాయి. ఇందులో మంచి రొమాంటిక్‌ మూవీస్‌ కూడా ఉన్నాయి. లవర్స్ మాత్రం పండగ చేసుకోవచ్చు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Feb 09 2026, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న చిత్రాలివే
Image Credit : Asianet News

వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న చిత్రాలివే

వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ వారం పలు క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అంతేకాదు కొన్ని రీ రిలీజెస్‌లు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా నాగచైతన్య మూవీ ఉంది. అలాగే విశ్వక్‌ సేన్‌ నటించిన కామెడీ చిత్రం రాబోతుంది. సంతోష్‌ శోభన్‌ నటించిన రొమాంటిక్‌ చిత్రం, అర్జున్‌ సర్జా దర్శకత్వం వహించిన సినిమా కూడా ఉంది. ఇలా ఏడెనిమిది సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాయి. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
విశ్వక్‌ సేన్‌ `ఫంకీ`
Image Credit : Asianet News

విశ్వక్‌ సేన్‌ `ఫంకీ`

ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్లోకి వస్తున్న సినిమాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది విశ్వక్‌ సేన్‌ నటించిన ఫంకీ మూవీ. ఇది ఫిబ్రవరి 13న (శుక్రవారం) విడుదలవుతుంది. ప్రేమికుల రోజుని ముందుగానే తీసుకొస్తుంది. సినిమా బ్యాక్‌ డ్రాప్‌లో సాగే లవ్‌ అండ్‌ కామెడీ చిత్రమిది. అనుదీప్‌ కేవీ దర్శకత్వం వహించారు. నాగవంశీ నిర్మించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. నవ్వుల రైడ్‌ పక్కా అని అర్థమవుతుంది. ఇందులో విశ్వక్‌ సేన్‌కి జోడీగా కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. విశ్వక్‌ తన ఇమేజ్‌ని మార్చి చేస్తున్న చిత్రమిది. దీనికి మంచి బజ్‌ ఏర్పడింది.

Related Articles

Related image1
Balakrishna vs Rajasekhar: ప్రేమికులరోజు స్పెషల్‌గా రాజశేఖర్‌తో పోటీ పడి అడ్రస్‌ లేకుండాపోయిన బాలకృష్ణ సినిమా ఇదే
Related image2
Jagan-Vijay: పెళ్లి వేడుకలో వైఎస్‌ జగన్‌, దళపతి విజయ్‌ సందడి.. సూర్య, కార్తీలతో ఆత్మీయ ఆలింగనం.. ఫోటోలు వైరల్‌
39
శివ కంఠమనేని `అమరావతికి ఆహ్వానం`
Image Credit : Asianet News

శివ కంఠమనేని `అమరావతికి ఆహ్వానం`

శుక్రవారం విడుదల కాబోతున్న చిత్రాల్లో అమరావతికి ఆహ్వానం మూవీ కూడా ఉంది. శివ కంఠమనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీల‌క‌ పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ సినిమాను నిర్మించారు. క్రైమ్‌ హర్రర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ట్రైలర్‌ ఎంగేజింగ్‌గా ఆకట్టుకుంది.

49
కొత్త జంట `స్కై`
Image Credit : Asianet News

కొత్త జంట `స్కై`

ఇదే రోజు మరో చిన్న చిత్రం `స్కై` రిలీజ్‌ అవుతుంది. మురళీ కృష్ణంరాజు, శ్రుతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా ఇది. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

59
బాక్సింగ్‌ నేపథ్యంలో `చథా పచ్చ`
Image Credit : Asianet News

బాక్సింగ్‌ నేపథ్యంలో `చథా పచ్చ`

ఇదే రోజు మరో చిన్న చిత్రం స్కై రిలీజ్‌ అవుతుంది. మురళీ కృష్ణంరాజు, శ్రుతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా ఇది. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

69
రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా `కపుల్‌ ఫ్రెండ్లీ`
Image Credit : Asianet News

రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా `కపుల్‌ ఫ్రెండ్లీ`

ప్రేమికుల రోజు సందర్భంగా శనివారం (ఫిబ్రవరి 14) కూడా సినిమాలు విడుదలవుతున్నాయి.  ఆ రోజు కపుల్‌ ఫ్రెండ్లీ రిలీజ్‌ కానుంది. కొంత గ్యాప్‌ తర్వాత సంతోష్‌ శోభన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. మానస వారణాసి హీరోయిన్‌గా చేసింది. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. కుర్రాళ్లకి పండగే అనేలా ఉంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై జయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు.

79
అర్జున్‌ దర్శకత్వం వహించిన `సీతా పయనం`
Image Credit : Asianet News

అర్జున్‌ దర్శకత్వం వహించిన `సీతా పయనం`

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ దర్శకత్వం వహించిన మూవీ సీతా పయనం. ఇందులో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. నిరంజన్ హీరో. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రాబోతోన్న ఈ సినిమాలో అర్జున్‌ మేనల్లుడు ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా, మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని ఈ ట్రైలర్‌లో జోడించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని ‘సీతా పయనం’ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

89
నాగచైతన్య, సాయిపల్లవి `లవ్‌ స్టోరీ` రీ రిలీజ్‌
Image Credit : Asianet News

నాగచైతన్య, సాయిపల్లవి `లవ్‌ స్టోరీ` రీ రిలీజ్‌

వీటితోపాటు రీ రిలీజెస్‌ మూవీస్‌ కూడా ఉన్నాయి. నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్‌ స్టోరీ కూడా రీ రిలీజ్‌ కానుంది. ఫిబ్రవరి 14న దీన్ని రిలీజ్‌ చేస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దీనికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. లవర్స్ కిది మంచి ట్రీట్‌ ఇచ్చే మూవీ అవుతుంది.

99
ఉదయ్‌ కిరణ్‌ `మనసంతా నువ్వే` రీ రిలీజ్‌
Image Credit : Asianet News

ఉదయ్‌ కిరణ్‌ `మనసంతా నువ్వే` రీ రిలీజ్‌

దీన్ని మించి మరో లవ్‌ స్టోరీ రాబోతుంది. అదే ఉదయ్‌ కిరణ్‌ నటించిన మనసంతా నువ్వే. ఉదయ్‌ కిరణ్‌, రీ మా సేన్‌, తనూ రాయ్‌ నటించిన చిత్రమిది. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. సుమంత్‌ ఆర్ట్స్ పతాకంపై ఎంఎస్‌ రాజు నిర్మించిన చిత్రమిది. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించారు. 2001లో విడుదలై పెద్ద హిట్‌ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ చైతన్య
సాయి పల్లవి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Balakrishna vs Rajasekhar: ప్రేమికులరోజు స్పెషల్‌గా రాజశేఖర్‌తో పోటీ పడి అడ్రస్‌ లేకుండాపోయిన బాలకృష్ణ సినిమా ఇదే
Recommended image2
Jagan-Vijay: పెళ్లి వేడుకలో వైఎస్‌ జగన్‌, దళపతి విజయ్‌ సందడి.. సూర్య, కార్తీలతో ఆత్మీయ ఆలింగనం.. ఫోటోలు వైరల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved