మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ  తెరకెక్కించిన చిత్రం ‘డి - కంపెనీ’ . అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘డి - కంపెనీ’ పేరుతో రూపొందిన ఈ సినిమాని స్పార్క్ ఓటీటీ లో ఈనెల 15న ప్రసారం చేసారు.  ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు. అందుకు కారణం ...ఈ సినిమా రెండు పార్ట్ లనే విషయం దాచి పెట్టి వర్మ రిలీజ్ చేయటమే అంటున్నారు. దావూద్ ఇబ్ర‌హీం జీవిత క‌థ అనగానే ఓ గ్యాంగస్టర్ లైఫ్ ని చూడబోతున్నామని ఉత్సాహపడ్డారు  జ‌నం. దావూద్ ముంబ‌యిలో చేసిన అరాచ‌కాలు, ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి చేసిన దాడులు లాంటివ‌న్నీ చూడ‌బోతున్నామ‌ని ఆశించారు. కానీ ఈ సినిమాలో అవేమీ లేదు.

కేవలం దావూద్ డాన్‌గా ఒక స్థాయి అందుకోవ‌డానికి ముందు జ‌రిగిన సంఘటనలు మాత్ర‌మే ఈ సినిమాలో చూపించారు. నెక్ట్స్ లెవిల్ కు  అత‌డి ఎదుగుద‌ల అంతా ఇంకో పార్ట్‌లో చూపిస్తాడ‌ట‌. ఈ విష‌యం వ‌ర్మ ముందు చెప్ప‌కపమడీ గేమ్ ఆడారు. దాంతో ఈ పార్ట్ వన్ చూసిన వారు ఇప్పటికే నిరాశపడ్డారు. మళ్లీ  దావూద్ మిగ‌తా క‌థ కోసం మ‌ళ్లీ డ‌బ్బులు ఖర్చు పెట్టాలా అంటున్నారు. ఏదైమైనా ఇలా దాచిపెట్టుకుండా సినిమా రెండు భాగాల‌ని వ‌ర్మ ముందే కాస్త ప్రిపేర్ చేసి ఉంటే బాగుండేది అంటున్నారు. ఇలాంటి ఫ‌స్ట్ పార్ట్ చూసిన చికాకుతో ఇక రెండో పార్ట్ చూస్తారా అనే సందేహం వెల్లబుచ్చుతున్నారు.

 ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడన్నది ఇందులో చూపించారు దర్శకుడు. అలాగే అతను స్థాపించిన డి-కంపెనీ నీడలో బతికిన ఇతర గ్యాంగ్‌స్టర్ల జీవితాల్ని ఈ చిత్రంలో స్పృశించారు .