ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన క్రేజ్ కోసం , పబ్లిసిటి కోసం ఎవరినైనా లాగేస్తూంటారు. ఎంతటివారిపైన అయినా కామెంట్స్ చేసేస్తూంటారు. అదే కోవలో ఇప్పుడు ప్రభాస్ కులం పేరెత్తుతూ  మరోసారి సెన్సేషన్ కామెంట్స్  చేశారు. ట్విట్టర్ వేదికగా వర్మ మరోసారి కులాల వి హాట్ హాట్ కామెంట్స్ చేసి ప్రభాస్ అభిమానులను సైతం వైపుకు తిప్పుకోవాలని చూసారు. సాహో రిలీజ్ సందర్బంగా అందరి దృష్టీ ప్రభాస్ పైనే ఉంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ కులం గురించి ఆయన మాట్లాడారు. ప్రభాస్‌ది తన క్యాస్టే అంటూ... వాయిస్ ఓవర్ ఇస్తూ... ఓ వీడియోను రిలీజ్ చేశారు. 

అలాగే తనకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువన్నారు. అందుకే ప్రభాస్ ‘సాహో’ సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురుచూస్తున్నా అన్నారు. ఎందుకంటే ప్రభాస్ తన క్యాస్ట్ కాబట్టి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను డైరెక్షన్‌ చేస్తున్న ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అన్న సినిమాలో మరోపాటను కూడా రిలీజ్ చేస్తున్నానని పేర్కొన్నారు.

ఆగష్టు 27వ తేదీ అంటే రేపు ఉదయం 9.27 నిమిషాలకు బ్రహ్మ ముహుర్తంలో పాటను రిలీజ్ చేస్తున్నా అన్నారు ఆర్జీవీ.  నిజానికి ఆ పాటకు ప్రభాస్ కు, ప్రభాస్ కులానికి సంబంధం లేకపోయినా కేవలం ఆ టాపిక్ ఎత్తటం ద్వారా అందరి దృష్టినీ ఆయనవైపు తిప్పుకోవాలనే ఆలోచన చేసారు. చూస్తూంటే సక్సెస్ అయ్యినట్లే కనిపిస్తోంది.