RGV Tweet: శ్రీదేవి నుంచి జయసుధ వైపు టర్న్ అయిన రామ్ గోపాల్ వర్మ
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఏ హీరోయిన్ ఇష్టం అంటే వెంటనే అందరూ చెప్పే పేరు శ్రీదేవి. ఈ విషయాన్ని ఆయన చాలా సార్లు చెప్పారు కూడా. కాని ఇప్పుడు శ్రీదేవి నుంచి జయసుధ వైపు టర్న్ అయినట్టున్నారు వర్మ.
అతిలోక సుందరి శ్రీదేవిని ప్రాణానికి ప్రాణంగా ఆరాధించే వాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వర్మకు సహజనటి జయసుధ అన్నాకూడా దాదాపు అంతే అభిమానం. ఈ విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పారు వర్మ. ముఖ్యంగా ఓ సినిమా పోస్టర్ పై ఉన్న జయసుధను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయారట రామ్ గోపాల్ వర్మ.
ఈ విషయంలో చాలా సార్లు.. చాలా రకాలుగా వవరణ ఇచ్చారు వర్మ. ముఖ్యంగా శివరంజని సినిమాలో జయసుధ చేత కన్నీరు పెట్టించినందుకు మోహన్ బాబుపై రామ్ గోపాల్ వర్మ కోపం పెంచుకున్నారంట కూడా.ఆ తర్వాత జయసుధ, మోహన్ బాబులను జంటగా 2014లో రామ్ గోపాల్ వర్మ రౌడీ సినిమాను తీశారు. గతంలో సహజ నటితో మనీ, మనీ మనీ సినిమాను కూడా నిర్మించారు రామ్ గోపాల్ వర్మ.
ఇక రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ జయసుధను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమెను ఆకాశానికెత్తేశారు. ఇంతలా ఆమెను ఎందకు పొగిడారంటే.. రీసెంట్ గా జయసుధ దైవపుత్రుడు అనే క్రైస్తవ గీతాన్ని పాడారు. ఈ పాటను విన్న వర్మ మెస్మరైజ్ అయ్యారు. అవ్వడంతో పాటు ఆమె పాటిని ఈ పాటను ట్విట్టర్ లో వర్మ షేర్ చేశారు. శేర్ చేయడంతో పాటు జయసుధ గురించి ఇలా రాశారు. జయసుధగారూ... మీరు పాడిన పాట వింటే విశ్వాసం లేని వారు కూడా విశ్వాసులుగా మారిపోతారు. అంటూ.. ట్వీట్ చేశారు.
అంతేకాదు జయసుధ పాటకు సంబంధించిన లింక్ ను కూడా షేర్ చేశారు వర్మ. ఈ స్టార్ సెన్సేషనల్ డైరెక్టర్ స్పందనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక రీసెంట్ గా వర్మ డేంజిరస్ మూవీని రిలీజ్ చేయబోయి.. వివాదాస్పదం అయ్యారు. ఇద్దరు స్వలింగ సంపర్కులైన ఆడవారి కథతో ఈసినిమా తెరకెక్కింది. దాంతో ఈమూవీని ప్రదర్శించడానికి కోన్ని థియేటర్ల ఒప్పుకోలేదు.