దర్శకుడు పూరి జగన్నాథ్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడని అందరికి తెలిసిందే. శివ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేసిన పూరి ఆ సినిమాలో ఒక పాటలో కూడా కనిపించాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆ జ్ఞాపకాన్ని దర్శకుడు ఆర్జీవీ ఓ సారి గుర్తు చేసుకున్నాడు. 

అక్కడ బ్లూ షర్ట్ లో కనిపిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్.. ఇప్పుడున్న సూపర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటూ.. హే జగన్ వాటే జర్నీ అని పేర్కొన్నాడు. అందుకు దర్శకుడు పూరి కూడా యస్ సర్.. అంటూ సరదాగా గురు భక్తిని చాటుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.