లక్ష్మీస్ ఎన్టీఆర్ అసలైన కథను తాను చూపిస్తానంటూ రామ్ గోపాల్ వర్మ ఇటీవల చేసిన హడావుడి గురించి తెలిసిందే. అయితే సినిమా పనులను ఎంతవరకు కానిచ్చాడో ఇప్పటివరకు ఎవ్వరికి క్లారిటీ రావడం లేదు. ఆయన కూడా ఎవరికీ చెప్పడం లేదు. అయితే పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయని ఫొటోలతో షాక్ ఇస్తున్నారు. 

ఎన్టీఆర్ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఒక అల్ట్రా మెలోడీ సాంగ్ అప్పుడే రెడీ అయ్యిందట. సిరా శ్రీ రాసిన ఆ పాటను గ్రేట్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారని రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. వారికీ సంబందించిన ఒక ఫొటోని కూడా షేర్ చేశాడు.

ఎన్టీఆర్ సినిమా మ్యూజిక్ పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా యొక్క పాటలను వారికంటే ముందే రిలీజ్ చెయ్యాలని కళ్యాణి మాలిక్ తో స్పీడ్ గా కంపోజింగ్ చేయిస్తున్నాడు వర్మ. ఈ సినిమాపై చాలా వరకు అందరి ద్రుష్టి పడిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఫస్ట్ పార్ట్ కథానాయకుడు సంక్రాంతికి రిలీజ్ కానుంది. అదే సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ను కూడా రిలీజ్ చెయ్యాలని వర్మ డిసైడ్ అయ్యాడు.