Asianet News TeluguAsianet News Telugu

AP Ticket Rates Controversy: ట్వీట్ల వర్షంతో ఏపీ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్న ఆర్జీవీ.. చట్ట ఉల్లంఘన అంటూ

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఓ టీవీ డిబేట్లోనే ప్రశ్నించారు. దీంతో ఏకంగా మంత్రిని కలిసి సోమవారం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చర్చలు చాలా సంతృప్తికరంగా, సానుకూలంగా జరిగాయని చెప్పిన వర్మ.. మళ్లీ మంగళవారం మధ్యాహ్నం నుంచి ట్వీట్ల సునామీ స్టార్ట్ చేశాడు. 

rgv shared shocking tweets to ap government misuse Fundamental Rights
Author
Hyderabad, First Published Jan 11, 2022, 3:58 PM IST

రామ్‌గోపాల్‌ వర్మ అంటే సంచలన దర్శకుడి నుంచి వివాదాస్పద డైరెక్టర్‌గా మారిపోయారు. ఇటీవల అన్ని కాంట్రవర్షియల్‌ సబ్జెట్‌లతో చిన్న చిన్న సినిమాలు చేస్తూ బండిని లాగిస్తున్నారు. ఎంతటి సీరియస్‌ విషయాన్నైనా సెటైరికల్‌గా, కామెడీగా రెస్పాండ్‌ అయ్యే వర్మ.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల విషయంలో మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నిజం చెప్పాలంటే మరే సినిమా వ్యక్తులు కూడా ఈ స్థాయిలో స్పందించలేదు. ఇంకా చెప్పాలంటే టికెట్ల రేట్ల ఇష్యూని ఇప్పుడు ఆయన తన పర్సనల్‌గా తీసుకున్నట్టుగా ఉంది. అంతేకాదు ఇండస్ట్రీ తరపున వాధిస్తున్న ఒకే ఒక్కడుగా ఉన్నారు. 

ప్రైవేట్‌ సెక్టార్‌ అయిన సినిమా టికెట్ల రేట్లని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది, వాళ్లకు హక్కు ఎవరిచ్చానేదాన్నుంచి ఆయన ట్వీట్ల దాడి ప్రారంభమైంది. వరుసగా గ్యాప్‌ లేకుండా గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వాన్ని ట్వీట్ల రూపంలోనే ఆడుకుంటున్నారు. ఓవైపు టీవీ డిబేట్లలో, మరోవైపు ట్వీట్లలో ఛాన్స్ దొరికిన దారిలో తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంతోపాటు తికమక చేస్తున్నాడు. ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. 

ఆ మధ్య ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఓ టీవీ డిబేట్లోనే ప్రశ్నించారు. దీంతో ఏకంగా మంత్రిని కలిసి సోమవారం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చర్చలు చాలా సంతృప్తికరంగా, సానుకూలంగా జరిగాయని చెప్పిన వర్మ.. మళ్లీ మంగళవారం మధ్యాహ్నం నుంచి ట్వీట్ల సునామీ స్టార్ట్ చేశాడు. ఏపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టేలా ట్వీట్లు చేస్తూ, అందులోనే ప్రభుత్వ పరువు తీస్తూ, ప్రశ్నిస్తూ, ఇతర ప్రభుత్వాలు, దేశాలతో పోల్చుతూ చెడుగుడు ఆడుకున్నారు వర్మ. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినిమా రంగమే ప్రమాదంలో పడే అవకాశం ఉందని, దీని వల్ల ప్రభుత్వానికి కూడా తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని తెలిపారు.  క్రియేటివ్‌గా, క్వాలిటీతో సినిమాలు తీయడం కష్టమని తెలిపారు వర్మ. ఐదు వందల కోట్లు పెట్టిన రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా టికెట్‌ రేట్లు, కోటి రూపాయాలతో తీసిన సినిమా టికెట్‌ రేట్లు ఒకేలా ఉంటే ఎలా సాధ్యంమంటూ ప్రశ్నించారు వర్మ. 

పేర్నినానికి సమస్య వివరించాక వివాదం కాస్త తగ్గుముఖం పట్టిందన్న వర్మ, మళ్లీ ప్రశ్నలు స్టార్ట్ చేశారు. `సినిమాలే కాకుండా ఇతర ప్రైవేట్‌ ఉత్పత్తుల అమ్మకంపై ఏపీ ప్రభుత్వం ధరల పరిమితి విధిస్తుందా? అలా చేస్తే ఆ ప్రొడక్ట్ పేర్లు, అలా చేయడానిఇక కారణాలేంటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ధరని నిర్ణయించేటప్పుడు సినిమా బడ్జెట్‌తో తమకి సంబంధం లేదనే వాదన ప్రపంచంలో ఎక్కడైనా తయారైన ఉత్పత్తి విషయంలో జరుగుతుందా? అన్నారు. వినియోగదారుడికి తక్కువ ధరకు మెరుగైన నాణ్యతను అందించడానికి తయారీదారుల మధ్య తీవ్ర మైన పోటీ ఉంటుంది, అందుకు తక్కువ ధరకి అమ్ముతుంటారు గానీ, దానిపై బాహ్యశక్తుల ప్రమేయం ఉందన్నారు వర్మ. ప్రభుత్వమే తక్కువ ధరకి విక్రయించాలని కండీషన్‌ పెడితే ఆ ఉత్పత్తిని నిలిపివేయడమో, లేక తక్కువ నాణ్యమైన ఉత్పత్తులను తీసుకురావడమో చేస్తారన్నారు. 

మహారాష్ట్రలో గరిష్టంగా పెద్ద సినిమాలకు 2200 రూపాయలు పెంచుకునే వెసులుబాటు ఉంది. కానీ ఏపీలో కనీసం 200కూడా అనుమతించకపోతే వివక్షనునిషేధించే ఆర్టికల్‌ 14ని నేరుగా ఉల్లంఘించినట్టు కాదా? . కోవిడ్‌ సమయంలోనూ మహారాష్ట్రలో ఇప్పటికే 24గంటలు థియేటర్లని నడపడానికి ప్రభుత్వం అనుమతించింది. రాత్రి, పగలులో ఎన్ని షోలు వేసినా జరిగే హాని ఏంటీ? అని ప్రశ్నించారు వర్మ. ఆడియెన్స్ రాత్రి సమయంలో సినిమా చూసే అవకాశాన్ని ఎందుకు దోచుకోవాలని అని అన్నారు. బెనిఫిట్‌ షోలు పెట్టి, ఎక్కువ ధర పెట్టి ప్రజలు ఇష్టపూర్వకంగా కొనుగోలు చేస్తే ప్రభుత్వం కూడా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కదా?

పవన్‌ కళ్యాణ్‌ లాంటి కొంత మంది తారలకు ఎక్కువ పారితోషికం ఎందుకివ్వాలనే విసయంలో మనం ఫోన్‌ని పగలగొట్టి, ఉపయోగించిన మెటీరియల్‌ వాస్తవ ధరను లెక్కించినట్టయితే అది వెయ్యి రూపాయలు కూడా కాకపోవచ్చు. కానీ ఆలోచన బ్రాండ్‌,మార్కెట్‌ డిమాండ్‌ కారణంగా దాదాపు రెండు లక్షలకు ఆ ఫోన్ విక్రయించబడుతుందని తెలిపారు వర్మ. సినిమాటోగ్రఫీ చట్టం 1955ని దాదాపు 70ఏళ్ల తర్వాత హఠాత్తుగా తవ్వి, దాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యంకాదు. ఈ చట్టాన్ని కోర్ట్ లో సవాల్‌ చేయాల్సిన అవసరం ఉంది.

ఆర్టికల్‌ 14ని ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తూ ఏపీలో యాదృచ్చికంగా చట్టం తెచ్చిన నేపథ్యంలో ఈ వివక్షపై దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించడానికి ముంబాయిలో విలేకరులు సమావేశం ఏర్పాటు చేయాలని పలువరు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు బలవంతంగా తగ్గిస్తే చివరికి రెండు ఫలితాలు మాత్రమే వస్తాయి. థియేటర్ ఎగ్జిబిషన్‌ సిస్టమ్‌ కుప్పకూలుతుంది. మొత్తం సినిమా టికెట్ల సిస్టమే బ్లాక్‌అయిపోతుంది. ఇది అటు సినిమా పరిశ్రమకి, ఇటు ప్రభుత్వానికి మంచిది కాదు. 

Follow Us:
Download App:
  • android
  • ios