వర్మ,నాగార్జున సినిమాలో హిరోయిన్ గా అనుష్క

వర్మ,నాగార్జున సినిమాలో హిరోయిన్ గా అనుష్క

టాలీవుడ్ అగ్ర తారగా వెలుగొందుతున్న అనుష్క శెట్టి తెలుగులో సూపర్ సినిమాతో నాగార్జున సరసన వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి సత్తా చాటింది. అరుంధతి, బాహుబలి లాంటి చిత్రాలు అనుష్క కెరీర్ లో మైలు రాళ్లు.

 

ఇక తాజాగా నాగార్జున, రాం గోపాల్ వర్మ  కాంబినేషన్ లో చాలా కాలం గ్యాప్ తర్వాత మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీ బ్యానర్ లో రాంగోపాల్ వర్మ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇవాళే ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ మూవీలో హిరోయిన్ గా అనుష్కను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. అనుష్క అయితేనే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట.

 

ఇప్పటికే నాగార్జున, అనుష్క పలు సినిమాల్లో జంటగా నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. తాజాగా నాగార్జున సినిమాతో మళ్లీ తన సత్తా చాటాలనుకుంటున్న వర్మతో పాటు నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్ పై చాలా నమ్మకంగా కనిస్తున్నారు.

 

గత కొంత కాలంగా సినిమాలేవీ సైన్ చేయని అనుష్క ప్రస్థుతం తన బరువు తగ్గించేందుకు చాలా కష్టపడుతోంది. భాగమతి సినిమా షూటింగ్ పూర్తయ్యాక అనుష్క మరే సినిమా అంగీకరించలేదు. బాహుబలి రిలీజ్ తర్వాత మరే సినిమాకు సైన్ చేయని అనుష్క ఈసారి నాగ్ సరసన నటించేందుకు అంగీకరిస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. మరి ఆర్జీవీ,నాగ్ కాంబో మూవీలో హిరోయిన్ గా అనుష్క ఓకే అంటుందా లేక మరో హిరోయిన్ కోసం వెతకాలా అన్నది త్వరలో తేలనుంది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page