వరస పెట్టి హాట్ సినిమాలు రిలీజ్ చేస్తు దూసుకుపోతున్నారు వర్మ. మియా మాల్కోవాతో క్లైమాక్స్ చేసిన వర్మ , రిలీనేక్‌డ్ చిత్రంలో క్యాస్టూమ్ డిజైనర్ శ్రీ రాపాకను హీరోయిన్‌గా పరిచయం చేశాడు. ఈ క్రమంలో  వర్మ రెండు రోజుల క్రితం అప్సర రాణి అనే మరో కొత్త యువతిని పరిచయం చేసాడు.ఈ  క్రమంలో ఆమె హాట్ మొత్తం ముంచెత్తాయి. ఆమెతో థ్రిల్లర్ అనే ఓ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ క్రమంలో ఎవరూ అప్సర రాణి అని అందరూ ఎంక్వైరీలు మొదలెట్టారు. మరికొందరు తమ జ్ఞాపకశక్తికి పరిక్ష పెట్టారు. ఆమెను ఇంతకు ముందు ఎక్కడో చూసామని గ్రహించారు. అయితే ఎక్కడ చూసాం...వర్మ తొలిసారి ఇంట్రడ్యూస్ చేస్తున్న అమ్మాయి ఇంతకు ముందు మనకు ఎక్కడ తగిలింది అని గూగులు తల్లిని అడిగేసి  ఆమె బయోడేటా బయటకు తీశారు.

గూగుల్ తల్లి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో తేలిందేమిటంటే... ఈ హీరోయిన్ తెలుగు వారికి బాగా సుపరిచితురాలైన అమ్మాయి. ఈ హీరోయిన్ అసలు పేరు అంకిత మహారాణా. గతంలో 4 లెటర్స్ , ఉల్లాల్లా ఉల్లాల్లా అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఎవ్వరికి పెద్దగా ఈమె గుర్తు లేదు. దీనితో వర్మ ఈ హీరోయిన్ ని ట్విట్టర్ ద్వారా అప్సరా రాణిగా పరిచయం చేశాడు. గూగుల్ లో సెర్చ్ చేస్తే ఈమె అసలు పేరు, బయోడేటా బయటపడిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు హల్ చల్ చేస్తున్నాయి.

ఇక అంకిత మహరాణపై వర్మ కన్నుపడి ఏడాదిపైనే అయ్యిందని తెలిసింది. ఈమె నటించి ఉల్లాల.. ఉల్లాల సినిమా ఆడియో లాంఛ్ వర్మ చేతుల మీదుగానే జరగడంతో అప్పుడే అంకితకు ఆఫర్ ఇచ్చాడు వర్మ. ఆ తరువాతే వర్మతో సినిమా చేస్తున్నానని.. తనను ఇంకా సెక్సీగా అవ్వమని వర్మ చెప్పినట్టు అప్పట్లోనే బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ ఒరిస్సా పాప. మొత్తానికి శ్రీ రాపాకను స్వీటీగా.. అంకితను అప్సరారాణిగా పరిచయం చేసిన వర్మ లిస్ట్‌లో ఇంకెంత మంది అందగత్తెలు ఉన్నారో చూడాలి.