విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జేడీ చక్రవర్తితో చాలా రోజుల తరువాత ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. వర్మ మొదటి సినిమా శివలో విలన్ గా కనిపించిన జేడీ ఆ తరువాత వర్మతో చాలా సినిమాలు చేశాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సత్య సినిమా బాలీవుడ్ ని సైతం షేక్ చేసింది. 

అయితే మళ్ళీ చాలా ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఆ ప్రాజెక్ట్ ను వర్మ డైరెక్ట్ చేయడం లేదు. తన అసిస్టెంట్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్మ కేవలం సినిమా తన ప్రొడక్షన్ లో నిర్మించనున్నాడు. 

అప్పట్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జేడీ.చక్రవర్తి ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. ఆఫర్స్ బాగానే వస్తున్నప్పటికీ కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. రేపు రిలీజ్ కానున్న హిప్పీ సినిమాలో జెడి నటించాడు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు సరికొత్త జెడి కనిపించబోతున్నాడు.