విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో ఎవరు గ్రహించలేరు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఆయనకు ఎమోషన్స్ ఉండవని ప్రతి ఇంటర్వ్యూలో చెబుతుంటారు. కానీ ఆయనకు ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయని వర్మ తల్లి కూడా చెబుతుంటారు. ఇకపోతే రీసెంట్ గా వర్మ తన మేన కోడలితో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. 

తన కండలు ఆమె ముందు చిన్నబోయాయి అంటూ ఆమెన్ గెలిచింది నేను ఓడాను అని మేనకోడలు శ్రావ్య వర్మతో ఉన్న ఫోటోను వర్మ పోస్ట్ చేశారు. సౌత్ లో దాదాపు స్టార్ హీరోయిన్స్ అందరికి శ్రావ్య సుపరిచితమే. ఎందుకంటే శ్రావ్య ఫ్యాషన్ డిజైనర్. వర్మపై కూడా ఆమె అప్పుడపుడు -ప్రయోగాలు చేస్తుంటారు. ఇక రీసెంట్ గా వారు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.