ఈ కాంట్రవర్సీ సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో గాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన వ్యక్తిని వర్మ వెస్ట్ గోదావరి నుంచి తెప్పించినట్లు చెప్పాడు.
టాలీవుడ్ లో ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సంబందించిన ఎన్టీఆర్ లుక్ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. చిన్న క్లిప్ 12 గంటల్లోనే యూ ట్యూబ్ లో వన్ మిలియన్ ను క్రాస్ చేసింది. ఈ కాంట్రవర్సీ సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో గాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఇక ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన వ్యక్తిని వర్మ వెస్ట్ గోదావరి నుంచి తెప్పించినట్లు చెప్పాడు. అతను ఒక థియేటర్ ఆర్టిస్ట్ అని అయితే కొన్ని నెలల పాటు నటనపై శిక్షణను ఇచ్చి సినిమాకు తగ్గట్లుగా లుక్ ని మార్చినట్లు వర్మ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఎన్టీఆర్ హావభావాలు మాడ్లాతే విధానం అన్ని విషయాల్లో స్ట్రాంగ్ ట్రైనింగ్ ఇచ్చి వర్మ సినిమా కోసం సిద్ధం చేసినట్లు చెప్పాడు.
ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కనిపించిన ఎన్టీఆర్ గురించి ఇంతకంటే లోతుగా వివరాలను బయటపెట్టడం లేదు. సాధారణంగా వర్మ తన సినిమాలో నటీనటులను నార్త్ నుంచి తెచ్చుకుంటాడు. గతంలో రక్త చరిత్ర సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం హిందీ యాక్టర్ శత్రుఘన్ సిన్హా ను తీసుకున్నాడు. ఇక ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కనిపిస్తోంది మనోడే అని వర్మ తెలియజేశాడు.
