వర్మ  నాలుగు అమూల్యమైన సలహాలిచ్చారు. ఇలాంటి టికెట్ల రేట్లు ఉంటే సినిమా, థియేటర్‌ అనేది పరిణామం చెందాలని, మళ్లీ పాత రోజులకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వివరించారు. 

జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో తీసుకుంటున్న చర్యలకు సంబంధించి రామ్‌గోపాల్‌ వర్మ వరుస ట్వీట్లతో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. తాను ఓ విషయంపై దృష్టి పెడితే ఎంత భయంకరంగా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం పదుల ట్వీట్లతో ఏపీ ప్రభుత్వానికి ముంచెమటలు పట్టించిన రామ్‌గోపాల్‌ వర్మ.. అదే సమయంలో కొన్ని సలహాలిచ్చారు. బలవంతంగా తక్కువ టికెట్ల రేట్లని అవలంభిస్తే థియేటర్లు మూసుకోవాల్సిందేనని వార్నింగ్‌ ఇచ్చారు. దీని వల్ల బ్లాక్‌ టికెటింగ్‌ పెరుగుతుందని, ప్రభుత్వానికి చాలా నష్టం వస్తుందన్నారు. 

Scroll to load tweet…

దీంతోపాటు వర్మ నాలుగు అమూల్యమైన సలహాలిచ్చారు. ఇలాంటి టికెట్ల రేట్లు ఉంటే సినిమా, థియేటర్‌ అనేది పరిణామం చెందాలని, మళ్లీ పాత రోజులకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వివరించారు. ఊరూర తిరిగి సినిమాలు ప్రదర్శించాలని వెల్లడించారు. థియేటర్‌ వ్యవస్థ పోయి ఇక మినీ థియేటర్లని తీసుకురావాలని, సినిమా చూసేలా జనాన్ని ప్రోత్సహించాలని, ఆడియెన్స్ సంఖ్యని పెంచాలని వెల్లడించారు. చైనా, అమెరికాలో థియేటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. అలా మన వద్ద కూడా థియేటర్ల సంఖ్యని, మినీ థియేటర్లని పెంచాలన్నారు. 

Scroll to load tweet…

అదే సమయంలో ప్రభుత్వానికి కొన్ని చురకలంటించారు. టికెట్ల రేట్లు ప్రజలకు ఇబ్బందిగా మారితే, నిత్యావసర వస్తువుల ధరని భరించలేని వ్యక్తుల గురించి ప్రభుత్వానికి నిజంగా శ్రద్ధ ఉంటే, తక్కువ ధర టికెట్లని కొంత సంక్షేమ పథకాలుగా,పాక్షికంగా ప్రభుత్వ ఛారిటీగా అందించవచ్చు` అని సెటైర్లు వేశారు వర్మ. ఇక సినిమాని ప్రోత్సాహించాలనుకుంటే, సినిమాని చూసే వ్యక్తుల సంఖ్యని పెంచడం, తక్కువ టికెట్‌ ధరలతో ఇంటీరియరల్‌కు చేరుకోవడం వంటి వినూత్నమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన నాలుగు సలహాలిచ్చారు వర్మ. 

అందులో ఒకటి.. పిక్చర్‌ టైమ్ టెక్నాలజీ ప్రకారం.. దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లగలిగే చిన్న ట్రక్కు ఉంటుంది. కేవలం కొన్ని గంటల్లోనే వారు అన్ని భద్రతా నిబంధనలను చెక్కుచెదరకుండా గాలితో కూడిన థియేటర్‌ని నిర్మించారు. ఇప్పటికే ఇది ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ పద్ధతిని ఫాలో కావాలన్నారు. రెండు.. కారవాన్‌ టాకీస్‌. మూవీ ఆన్‌ వీల్స్ కాన్సెప్ట్ ప్రకారం భారతదేశంలోని అంతర్గత ప్రాంతాలలో ఉన్న గ్రామీణజనాభా కోసం గ్రామాలలో సినిమాని ప్రదర్శించడం. 

మూడు.. నోవా సినిమా.. ఇటుక మోర్టార్‌కి బదులుగా, ప్రీ ఫ్యాబ్రికేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి సినిమా థియేటర్లని ఏర్పాటు చేయడం. ఖాళీ ప్లాట్‌లను అద్దెకు తీసుకుని, తక్కువ ఖర్చుతో థియేటర్ నిర్మించి సినిమాలు ప్రదర్శించడం. నాల్గవది.. పెద్ద గదులు, గ్యారేజీలు, నిరూపయోగంగా ఉన్న గోడౌన్లని, ఖాళీ స్థాలను మినీ థియేటర్లుగా మర్చాడానికి ప్రజలను ప్రోత్సహించడం అంటూ సెటైరికల్‌గానే ఏపీ ప్రభుత్వానికి సలహాలిచ్చారు వర్మ. ఓ రకంగా థియేటర్‌, మల్టీఫ్లెక్స్ అనే సిస్టమే లేకుండా చేయడమన్నమాట. ఇంటిదగ్గరికే సినిమా అనేలా ఉంది వర్మ ఇచ్చిన సలహా. 

ఇక చివరగా వర్మ చెబుతూ, ప్రభుత్వం షోల ధర, షోల సంఖ్య, షోల టైమ్‌ని చిత్ర పరిశ్రమకి వదిలేసి, దాని శక్తి, వనరులు రెండింటినీ భద్రతా నిబంధనలు, లావాదేవీలపై పారదర్శకత అమలు చేయడంపై మాత్రమే కేంద్రీకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్నినానికి మరో రిక్వెస్ట్ చేశారు వర్మ. వైసీపీ నాయకులు, సినిమా వాళ్లు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం కంటే, ఒకరితో ఒకరు కూర్చొని ఆరోగ్యకరమైన చర్చలు జరుపుకోవాలన్నారు. ఈ విషయంలో మీడియా సంస్థలు కూడా ఆత్మ శోధన చర్చని ప్రేరేపించేలా వ్యవహరించాలని, అందరికి ప్రయోజనకరంగా ఉండాలన్నారు. మరి దీనిపై మంత్రి పేర్ని నాని, ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Scroll to load tweet…