Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవి నాకు కుక్క బిస్కెట్స్ వేసింది... ఆర్జీవి ఆసక్తికర కామెంట్స్ !

రామ్ గోపాల్ వర్మ శ్రీదేవికి వీరాభిమాని అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఓ సందర్భంలో శ్రీదేవి తనకు కుక్క బిస్కెట్స్ వేసిందని వర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

RGV Fond Memories of Sridevi: The Dog Biscuit Incident JMS
Author
First Published Oct 1, 2024, 7:30 PM IST | Last Updated Oct 1, 2024, 7:30 PM IST

రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే.  వర్మకు ఓసారి శ్రీదేవి కుక్క బిస్కెట్స్ వేసిందట. ఇంతకీ ఆ సందర్భం ఏంటో తెలుసా..?


రామ్ గోపాల్ వర్మకు ఏంటి.. శ్రీదేవి ఏంటి.. కుక్క బిస్కెట్లు వేయడం ఏంటీ అని పెద్ద డౌట్ అందరికి రావచ్చు అయితే ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా వర్మనే.. శ్రీదేవి ముందే అన్నారు. ఇంతకీ ఆయన ఏ సంద్బంలో ఈమాట అన్నారోతెలుసా. శ్రీదేవి మీద అభిమానాన్ని ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా తెలుపుకున్నారు రామ్ గోపాల్ వర్మ. అందులోభాగంగా ఓ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు అన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. 

గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వందసినిమాలకు సబంధించి ఈటీవిలో కార్యక్రమం ఒకటి వచ్చింది. అందులో ఒ ఎపిసోడ్ లో పాల్గొన్నారు రామ్ గోపాల్ వర్మ. వర్మతో పాటుగా శ్రీదేవి కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్నారు. ఈక్రమంలోనే శ్రీదేవి కెరీర్ లో మంచి పేరు తెచ్చిన సినిమాలు.. ఆమెను నిలబెట్టిన టాలీవుడ్ సినిమాల గురించి హోస్ట్ సుమ శ్రీదేవిని ప్రశ్నించారు. దానికి శ్రీదేవి ఇచ్చిన ఆన్సర్ తో రామ్ గోపాల్ వర్మ ఈ కామెంట్స్ చేశారు. 

శ్రీదేవి ఏమన్నారంటే.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తన కెరీర్ లో అద్భుతం అని అన్నారు. దాంతో పాటు మరికొన్ని సినమాల పేర్లు చెప్పిన శ్రీదేవి.. చివరిగా క్షణం క్షణం సినిమా కూడా తన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. దాంతో అలిగిన ఆర్జీవి... ఏదో కంటితుడుపుగా అంటున్నారు. కుక్కు బిస్కెట్ వేసినట్టు.. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి.. కావాలని అలా అంటున్నారు అని అన్నారు. 

దానికి శ్రీదేవి తో పాటు... అక్కడే ఉన్న రాఘవేంద్రరావు కూడా సమాధానం చెపుతూ.. అదేం లేదు. ఆసినిమా ఎంత హిట్ అయ్యింది. అప్పట్లో ఎంత అద్భుతం క్రియేట్ చేసింది అనే విషయం అందిరిక తెలుసు అన్నారు. దాంతో అంతా నవ్వుకున్నారు. ఈరకంగా శ్రీదేవిని నాకు కుక్క బిస్కెట్స్ వేస్తున్నారు అని ఆర్జీవి అన్నారు. 

RGV Fond Memories of Sridevi: The Dog Biscuit Incident JMS


శ్రీదేవి అంటే ఆర్జీవికి ప్రాణం.. 

రామ్ గోపాల్ వర్మకు హీరోయిన్ శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతపెద్ద దర్శకుడు శ్రీదేవికి వీరాభిమాని.. శ్రీదేవి అంటే తనకు ఎంత అభిమానమో.. చాలా సందర్భాల్లో ఆయన వెల్లడించారు కూడా. ఒక రకంగా ఆమెను ప్రేమిస్తూ.. ఆరాధిస్తుంటాడు ఆర్జీవి. ఆమె అంటే ఎంత ప్రాణం అంటే.. ఎవరైనా శ్రీదేవిని ఏమైనా అంటే అస్సులు ఊరుకునేవాడు కాదట. ఆమెను అంతలా అభిమానిస్తారు రామ్ గోపాలు వర్మ. 

ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో శ్రీదేవి సినిమాల చేసే టైమ్ లోనే ఆమెపై పిచ్చి అభిమానాన్ని పెంచుకున్నారట వర్మ. ఇక తనతో సినిమాలు చేయడం కూడా చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యేవారట. అసలు వర్మ ను డైరెక్టర్ గా నిలబెట్టిన శివ సినిమాలో నాగార్జున సరసన శ్రీదేవిని తీసుకోవాలి అని చాలా ట్రై చేశారట. కాని ఆమె బిజీగా ఉండటంలో అమలను హీరోయిన్ గాతీసుకున్నాడట రామ్ గోపాల్ వర్మ. 

అయితే ఆతరువాత క్షణ క్షణం, గొవింద గోవింద సినిమాల్లో శ్రీదేవిని తీసుకున్నారు వర్మ. ఇది ఇలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ తనను ఇంతలా  ఆరాధించినా.. ఆమెతో రెండు సినిమాలకంటే  ఎక్కువ  చేయలేకపోయాడు రామ్ గోపాల్ వర్మ.  ఇక శ్రీదేవి మరణం తరువాత ఆర్జీవి ఎంత బాధపడ్డారో ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ లద్వారా అందరు చూశారు. ఇప్పటికి ఆర్జీవీ శ్రీదేవిని ఇలానే ఆరాధిస్తున్నారు. 

RGV Fond Memories of Sridevi: The Dog Biscuit Incident JMS

టెంపర్ తగ్గించిన రామ్ గోపాల్ వర్మ. 

రామ్ గోపాల్ వర్మ.. వివాదాలను చుట్టు వైఫైలా మెయింటేన్ చేసే దర్శకుడు. తనకు ఏది అనిపిస్తే అది.. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ట్వీట్ చేయడం.. మనుషులను దారుణంగా టార్గెట్ చేయడం వర్మకు బాగా అలవాటు. గతంలో అద్భుతమైన సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఆతరువాత బూతు సినిమాలు, పొలిటికల్ సినిమాలతో తన బ్రాండ్ ను తానే చెడగొట్టుకున్నారు. ఇవి కాక లేడీస్ తో మనోడి వీడియోలు .. ఫోటోలు అయితే చెప్పనక్కర్లేదు.  

ఇక మొన్నటి వరకూ వరుస ట్వీట్లతో.. పొలిటికల్ హీట్ పుట్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు కాస్త చల్లబడ్డారు. కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో వైసీపీకి బాగా సపోర్ట్ చేసిన ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్.. ఇప్పుడు కామ్ అయ్యాడు. చంద్రబాబు మీద.. లోకేష్, పవన్ మీద ఏకంగా సినిమాలు కూడా చేసిన వర్మ.. తెలుగు దేశం గెలిచిన తరువాత వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆతరువాత నుంచి ఆయన ఏమాత్రం స్పందించలేదు. ప్రస్తుతం జరుగుతున్న వివాదాల మీద కూడా ఆయన స్పందించలేదు. సినిమాలకే పరిమితం అయ్యారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios