Asianet News TeluguAsianet News Telugu

వర్మ క్రేజ్ పోయిందా ? టీజర్ కు ఇంత దారుణమైన రెస్పాన్సా?


ఒక చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో ‘డీ కంపెనీ’ తెరకెక్కుతుంది. ఈ మూవీ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాల అన్నింటికి మదర్‌ లాంటిది అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా తన డ్రీమ్‌ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ‘డీ కంపెనీ’ ని మహా భారతంతో పోలుస్తూ.. మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.
 

Rgv D company teaser failed to attract jsp
Author
Hyderabad, First Published Jan 25, 2021, 9:09 AM IST

చూస్తూంటే వర్మ టైమ్ అయ్యిపోయిందేమో అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన సినిమాలు ఎలా ఉన్నా టీజర్స్, ట్రైలర్స్ డిజైన్ చేయటంలో స్పెషలిస్ట్. ఎలాంటి సినిమాకైనా ఆయన వదిలే ప్రమోషన్ మెటీరియల్ కు విపరీతమైన జనాదరణ లభిస్తుంది. యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ అవుతూంటాయి. అలాంటిది ఈ సారి ఆయన నేతృత్వంలో తెరకెక్కుతున్న ‘డీ కంపెనీ’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ శనివారం విడుదలైంది. జనం ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు కనపడలేదు. అప్పటికీ ఈ టీజర్‌ను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. 

అలాగే రితేష్ దేశ్‌ముఖ్, ఛార్మి కూడా టీజర్‌ను ట్వీట్ చేశారు. అయినప్పటికీ  ఈ టీజర్‌ ప్రేక్షకులను రీచ్ అవటంలో ఫెయిలైంది. ఇవన్నీ చూస్తూంటే  బట్టి ప్రేక్షకుల్లో వర్మపై క్రేజ్ తగ్గాయనిపిస్తోందంటున్నారు. కరోనా నేపధ్యంలో ఆయన వరసపెట్టి సినిమాలు ఓటీటి,ఏటీటి లలో వదిలారు. ఆ సినిమాలు ఆయన్ని బాగా దిగజార్చాయి. 

అందుకే ఆయన కొత్త ప్రాజెక్టులకు ఆదరణ అంతంత మాత్రంగా ఉంటోందని సోషల్ మీడియాలో వినపడుతోంది. తెలుగులో కొద్దిగా హైప్ ఉన్న సినిమాకు ఒకటి రెండు రోజుల్లో 10 లక్షల వ్యూస్ వచ్చేస్తున్నాయి. అలాంటిది, ఇప్పటి వరకు ‘డి-కంపెనీ’ తెలుగు టీజర్‌కు సుమారు 3 లక్షల వ్యూస్.. హిందీ టీజర్‌కు 5 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయనేదే డిస్కషన్ పాయింట్ గా మారింది. 

ఒక చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో ‘డీ కంపెనీ’ తెరకెక్కుతుంది. ఈ మూవీ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాల అన్నింటికి మదర్‌ లాంటిది అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా తన డ్రీమ్‌ ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ‘డీ కంపెనీ’ ని మహా భారతంతో పోలుస్తూ.. మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.
 
1980లో ముంబైలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ముంబై సామూహిక హత్యలు, దావూద్ గ్యాంగ్ సాగించిన దుర్మార్గాలను ఈ టీజర్ లో ప్రస్తావించారు. అయితే  ‘డి-కంపెనీ’ టీజర్‌లోనూ ఒకప్పటి వర్మ మార్క్ కనిపించలేదు. కొన్ని కెమెరా యాంగిల్స్, యాక్షన్ సీన్స్ పాత వర్మను గుర్తుచేస్తున్నా.. టీజర్ ఓవరాల్‌గా నిరాశపరిచింది. ఆఖరిలో వచ్చే ఒక్క డైలాగ్ మినహా టీజర్‌ మొత్తం బీజీఎంతోనే చూపించారు.  స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై స్పార్క్ సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios