Asianet News TeluguAsianet News Telugu

RGV vs Perni Nani: పేర్ని నానికి వర్మ వరుస కౌంటర్లు.. పవన్, సంపూర్ణేష్ బాబుని ప్రస్తావిస్తూ..

వివాదాస్పద దర్శకుడు వర్మ, ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య సుతిమెత్తని మాటల యుద్ధం కొనసాగుతోంది. సినిమా టికెట్ ధరల్ని ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుంది అంటూ వర్మ గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.

RGV continuous counters to AP Minister Perni Nani
Author
Hyderabad, First Published Jan 5, 2022, 12:42 PM IST

వివాదాస్పద దర్శకుడు వర్మ, ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య సుతిమెత్తని మాటల యుద్ధం కొనసాగుతోంది. సినిమా టికెట్ ధరల్ని ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుంది అంటూ వర్మ గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్మ, పేర్ని నాని మధ్య టీవీ చర్చా కార్యక్రమాలు కూడా జరిగాయి. 

ప్రస్తుతం వర్మ ట్విట్టర్ వేదికగా పేర్ని నానితో మాటల యుద్ధం చేస్తున్నాడు. నిర్మాతకు, ప్రేక్షకుడికి లేని ఇబ్బంది ప్రభుత్వానికి ఎందుకు? నిర్మాత సినిమా తీస్తున్నాడు. ప్రేక్షకుడు టికెట్ కొని సినిమా చూస్తాడు? మధ్యలో ప్రభుత్వ పెత్తనం ఏంటి ? అని వర్మ ప్రధానంగా ప్రశ్నిస్తున్నాడు. 

పవన్ కళ్యాణ్ సినిమాకి, సంపూర్ణేష్ బాబు సినిమాకి తేడా లేదని మీ ప్రభుత్వం వారు చెప్పారు. అంటే మంత్రిగా మీకు మీ డ్రైవర్ కు తేడా లేదు అంటారా ? అంటూ తనదైన శైలిలో వర్మ వరుస కౌంటర్లు వేస్తున్నారు.  

పేదల కోసం టికెట్ ధరలు తగ్గించాలనే ఆలోచన మంచిది కావచ్చు. పేద ప్రజలని ధనికుల్ని ఎలా చేయాలి అనే అంశంపై మీ ప్రభుత్వం పనిచేయాలి కానీ ఉన్న ధనికుల్ని పేదలని చేయకూడదు. సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ? అని పేర్ని నాని ప్రశ్నించగా వర్మ పై సమాధానం ఇచ్చారు. 

ఏ హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు అనే దానిపై ఏ రాష్ట్ర ప్రభుత్వమూ టికెట్ ధరలు నిర్ణయించడం లేదు అని పేర్ని నాని అన్నారు. దీనికి సమాధానంగా వర్మ పవన్ కళ్యాణ్, సంపూర్ణేష్ బాబులని ఉదహరించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ ని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా, సంపూర్ణేష్ బాబు సినిమా అయినా ప్రభుత్వం దృష్టిలో ఒక్కటే అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. అయితే మంత్రిగా మీరు.. మీ డ్రైవర్ ఒకటేనా అని వర్మ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. 

థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి అంటూ పేర్ని నాని అన్నారు. దీనికి వర్మ సమాధానం ఇస్తూ.. 100% కరెక్ట్.అలాంటప్పుడు V EPIC థియేటర్ లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు?ఈ కింది ట్వీట్ లో మీరు చెప్పింది మీకు అర్థమైతే ఇంక సమస్య లేనట్టే అని వర్మ అన్నారు. హోటల్స్ విషయానికి వస్తే అందులో ఉన్న సౌకర్యాలని బట్టే ధరలు ఉంటాయి అని వర్మ ప్రస్తావించారు. 

ప్రభుత్వం ఉప్పూ, పప్పు లాంటి నిత్యావసర ధరల్ని నియంత్రిచవచ్చు కానీ సినిమా టికెట్ ధరల్ని ఎలా నియంత్రిస్తుంది అని ప్రశ్నించారు. సినిమా థియేటర్లు కూడా ప్రజలకు సంబందించిన వినోద ప్రాంగణాలు అని పేర్ని నాని అన్నారు . దీనికి వర్మ బదులిస్తూ.. థియేటర్లనేవి , జూన్ 19 1905 న నికెలోడియోన్ అనే ప్రపంచం లోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికా లో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ  అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు..అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు..కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి అని ఆర్జీవీ నానికి సూచించారు. 

ప్రజల అభిమానాన్ని చిత్ర పరిశ్రమ లూటీ చేస్తోంది అని పేర్ని నాని ప్రస్తావించగా.. వర్మ తనదైన శైలిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. లూటీ అనే పదం ఉపయోగించాల్సింది బలవంతం చేసినప్పుడు, మోసం చేసినప్పుడు మాత్రమే. అమ్మేవాడు కొనేవాడు అంగీకారంతో జరిగేదాన్ని ట్రాన్సాక్షన్ అంటారు అని వర్మ సమాధానం ఇచ్చారు. 

సినిమా టికెట్ ని రూ. 1000కి, రూ 2000 కి అమ్ముకోవచ్చని ఏ ఎకనామిక్స్ చెప్పాయి అని నాని ప్రశ్నించారు. వర్మ సమాధానం ఇస్తూ.. ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో సినిమాని బట్టి, థియేటర్ ని బట్టి, వీక్ డేని బట్టి టికెట్ ధర రూ. 75 నుంచి 2200 వరకు మారుతూ ఉంటుంది. ఈ సంగతి మీకు తెలుసో తెలియదో. ఇది చాలా పాతకాలపు ఎకనామిక్స్ మీదే నడుస్తోంది అని వర్మ బదులిచ్చారు. 

ప్రభుత్వానికి తెలియకుండా అమ్మితే అది బ్లాక్ మార్కెట్. ఓపెన్ గా టికెట్ ధర ప్రకటించి అమ్ముతున్నప్పుడు క్రైమ్ ఎలా అవుతుంది అని వర్మ ప్రశ్నించారు. ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ వస్తోందిగా అని వర్మ అన్నారు. 

Also Read: Naga Babu Supports Rgv : రామ్ గోపాల్ వర్మకు నాగబాబు సపోర్ట్..ఎం చెప్పారంటే..?

ఇలా వర్మ, పేర్ని నాని మధ్య టికెట్ ధరల విషయంలో ప్రశ్నలు, విమర్శలు, సమాధానాలు, కౌంటర్లు కొనసాగుతున్నాయి. చాలా కాలంగా టాలీవుడ్ టికెట్ ధరల విషయంలో ప్రభుత్వాన్ని రిక్వస్ట్ చేస్తోంది. హీరో నాని, పవన్ కళ్యాణ్ అయితే ప్రభుత్వ తీరుని బహిరంగంగానే విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios