సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాలిటిక్స్ పై ఎప్పుడు లేని విధంగా కామెంట్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలెట్టేసున్నాడు. ఇక రీసెంట్ గా కెఏ.పాల్ కి సంబందించిన మరో వీడియోను పోస్ట్ చేసి డిఫరెంట్ కామెంట్ చేశాడు. 

ప్రజాశాంతి పార్టీ నేత పాల్ కారులో ప్రయాణిస్తూ బాక్సింగ్ విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ఎన్నికల్లో ఫైట్ చేసేందుకు మంచి కసి మీద ఉన్నట్లు హావభావాలతో చెబుతున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా వర్మ మాత్రం బాక్సింగ్ దిగ్గజాలకు గురువు ఇతనే అని పొగిడాడు. 

బాక్సర్‌ మైక్‌ టైసన్‌ను మట్టికరిపించిన ఈవాండర్‌ హోలీఫీల్డ్‌కు పాల్ శిక్షణ ఇచ్చాడని నేను ఒప్పేసుకున్నా అని పాల్ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 

అమ్మ పాత్రల్లో కనిపించే నటీమణుల రెమ్యునరేషన్