విలక్షణ దర్శకుడు, వివాదాల సినీ ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా భైరవ గీత సినిమాతో దోబూచులాడుతున్న సంగతి తెలిసిందే. అదుగో వస్తోంది ఇదిగో రిలీజ్ అవుతోంది అంటూ అరవింద సమేత రిలీజైనప్పటి నుంచి చెబుతున్నాడు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. 

ఇక ఆపసోపాలు పడి ఇటీవల ఎలక్షన్స్ మూమెంట్ లో రిలీజ్ చెయ్యడానికి సిద్దమైన వర్మ సెన్సార్ బోర్డు నుంచి ఊహించని విధంగా ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమాలో జంతువులను వినియోగించినందుకు గాను జంతు సంరక్షణ బోర్డు నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ను తీసుకురావాలని చెప్పగా అది కాస్త ఆలస్యం అవ్వడంతో రీసెంట్ గా అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయలేదు. 

ఇక ఫైనల్ గా సుదీర్ఘ చర్చల అనంతరం జంతు సంరక్షణ బోర్దు సినిమా రిలీజ్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రిలీజ్ కు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ వారమే సినిమాను తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. మరి తన హయాంలో శిష్యుడు సినిమాను రిలీజ్ చేస్తోన్న వర్మ ఎంతవరకు క్రెడిట్ అందుకుంటాడో చూడాలి.