2.0 తో పోటీ పడటానికి ఎవరు బయపడినా మేము తగ్గేది లేదు అంటూ భైరవగీత పోస్టర్స్ తో రామ్ గోపాల్ వర్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 2.0 నవంబర్ 29న రిలీజ్ కానుండగా పోటీగా నవంబర్ 30న భైరవగీతను రిలీజ్ చేయనున్నట్లు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. 

"అటు కొండలాంటి శంకర్.. ఇటు చిన్న రాయి లాంటి దర్శకుడు గట్టిగా పోటీ ఇవ్వనున్నాడు అని కార్టూన్ సినిమా పిల్లల సినిమా" అని అనేక రకాలుగా 2.0పై కామెంట్స్ చేస్తూనే వర్మ భైరవగీత ప్రమోషన్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా వర్మ భైరవగీత ను వాయిదా వేస్తున్నట్లు చెప్పడంతో నెటిజన్స్ వర్మ పై కామెంట్ చేస్తున్నారు. 

మొన్నటివరకు చూపించిన గాంబీర్యం ఏమైంది.. ఎప్పుడు రిలీజైనా  ఆ సినిమా డిజాస్టరే.. ఓ మై గాడ్ 2.0 రికార్డ్స్ సేఫ్.. అంటూ డిఫరెంట్ పంచ్ లతో వర్మ చేసిన ట్వీట్ కు సమాధానం ఇస్తున్నారు. 

దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆ ట్వీట్ మరింత వైరల్ గా మారింది. వర్మ సినిమాను ఎందుకు పోస్ట్ పోన్ చేశాడో గాని తన ట్వీట్ లో మాత్రం కొన్ని సెన్సార్ పనుల వల్ల సినిమాను డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు చెబుతూ.. ఎలక్షన్స్ మూడ్ లో భైరవగీతకు మీ ఒటేయ్యండి అంటూ వివరణ ఇచ్చాడు.