లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కు దగ్గరపడుతుంటే వర్మ ప్రమోషన్ డోస్ ఒక రేంజ్ లో చేస్తున్నాడు. అయితే మితిమీరిన ప్రచారాలు సినిమాకు ఎంతవరకు లాభమో ఆయనకే తెలియాలి. పవన్ కళ్యాణ్ ని పొగుడుతూనే రాళ్ళేయడం ఆయనకు అలవాటే. ఇక నిన్న రాత్రి పవన్ పై ఎలక్షన్స్ లో పోటీకి దిగుతా అంటూ ఓ పిట్ట కూత వదిలాడు. 

దీంతో నెటిజన్స్ వర్మ ట్విట్టర్ కామెంట్స్ కు అదే తరహాలో కౌంటర్ ఇస్తున్నారు. ఎలక్షన్స్ నామినేషన్స్ తేదీ ఎండ్ అయ్యింది రాజా అని  అందరూ సెటైర్స్ వేస్తుండగా..  అడ్వాన్స్ ఏప్రిల్ ఫుల్ అని ఎదో కవర్ చేశాడు. దీంతో ఎడిసినట్టే ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఆఫీసర్ టైమ్ లో పొలిటికల్ వివాదాల కారణంగా కొంత మైనెస్ అయిన వర్మ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. 

అయితే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ కంటెంట్ జనాలకు దగ్గరవ్వడంతో ఏం చేసినా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్న వర్మమళ్ళీ పొలిటికల్ వివాదాలతో వైరల్ అయ్యేలా చేస్తున్నాడు. మరి ఈ తరహా ట్విట్టర్ కూతలతో వివాదాల దర్శకుడు ఎంతవరకుసక్సెస్ అవుతాడో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.