విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా రోజుల తరువాత మరో సినిమాతో అందరిని ఎక్కువగా ఆకర్షించాడు. రక్త చరిత్ర తరువాత వర్మ ఎన్నో సినిమాలు చేశారు. అయితే అవన్నీ సినిమాలకంటే ఎక్కువగా బజ్ క్రియేట్ అయ్యింది లక్ష్మీస్ ఎన్టీఆర్ కె. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడో గాని ప్రమోషన్స్ మళ్ళీ మొదలెట్టాడు. 

రెండు రోజులు గ్యాప్ ఇచ్చాడో లేదో ట్విట్టర్ లో మహానాయకుడు అనంతరం తన సినిమా ప్రమోషన్స్ డోస్ పెంచాడు. పాటతో ఆడియెన్స్ ను తనవైపుకు తిప్పుకునేలా వేటను స్టార్ట్ చేస్తున్నాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడించిన పాటను రేపు ఉదయం 9 గంటల 27 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు.

‘నీ ఉనికి నా జీవితానికి అర్థం’ అనే ఆ పాటను సీర శ్రీ రచించారు.  ఈ సినిమాను కీరవాణి సోదరుడు కళ్యాణి మాలీక్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్ అండ్ పోస్టర్స్ తో షాకిచ్చిన వర్మ రేపు విడుదల చేయబోయే పాటతో ఏ రేంజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి.