టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడిన సంచలనమే అని మరోసారి నిరూపించాడు. రాజకీయాల్లోకి వర్మ వస్తే బావుంటుందని ఆయనను అభిమానించే వారు సోషల్ మీడియాలో చాలా సార్లు కామెంట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో పొలిటికల్ ఎంట్రీపై వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు. 

ఈ నెల 31లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీ లో రిలీజ్ అవుతున్న సందర్బంగా భీమవరంలో నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి వర్మ ప్రెస్ మీట్ నివహించారు. ఈ మీటింగ్ లో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తనకు ఏ మాత్రం లేదని చెబుతూ.. పాలిటిక్స్ లోకి రావాలనే ఆలోచన తనకు ఏ మాత్రం లేదని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. ఇక మ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తన వివరణ ఇచ్చారు. 

విజయవాడలో చదువుకునే రోజుల్లో కమ్మరాజ్యం గురించి ఎక్కువగా వినేవాడిని. కానీ ఇప్పుడు అక్కడంతా సుమోలో రెడ్లు అని వినిపించడం వింతగా అనిపిస్తోంది అందుకే ఆ టైటిల్ తో సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు వర్మ తెలియజేశారు.