ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిఖీ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించారు. తాజాగా సిద్ధిఖీ మాలీవుడ్ లో నటీమణుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన 'ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్'(డబ్ల్యూసీసీ)ను విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియో చూసిన రేవతి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మూడేళ్ల క్రితం సిద్ధిఖీ కారణంగా తనకు ఎదురైన చేదు ఘటనను గుర్తు చేసుకుంది. 2016లో తిరువనంతపురంలోని నీల థియేటర్ లో 'సుఖమయిరికటే' సినిమా ప్రివ్యూ జరుగుతున్నప్పుడు సిద్ధిఖీ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది.

తనకు 21 ఏళ్ల  వయసులో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపినట్లు చెప్పింది. ఆయనకు కూడా తనలాంటి కూతురు ఉందని, ఇలాంటి సంఘటన నీ కూతురికి ఎదురైతే ఏం చేస్తారు మిస్టర్ సిద్ధిఖీ అంటూ ప్రశ్నించింది.

అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన డబ్ల్యూసీసీని విమర్శిస్తున్నారని.. అసలు దానికి నువ్ అర్హుడివేనా..? అంటూ మండిపడింది. చిత్రపరిశ్రమలో నువ్ ఒక జెంటిల్మెన్ అని చెప్పుకోవడం సిగ్గుపడాల్సిన విషయమంటూ చెప్పుకొచ్చింది.

ఈమె వ్యాఖ్యలు మలయాళ ఇండస్ట్రీలో హా టాపిక్ గా మారాయి. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఆమె పబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.