మలయాళం నటుడు దిలీప్ కుమార్ గత కొంత కాలంగా వర్ధమాన నటి కిడ్నాప్ కేసులో విచారణని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం వరకు ఈ కేసుపై మలయాళం చిత్ర పరిశ్రమలోని నటీనటులందరూ దిలీప్ పై విమర్శలు చేశారు. 

మలయాళం నటుడు దిలీప్ కుమార్ గత కొంత కాలంగా వర్ధమాన నటి కిడ్నాప్ కేసులో విచారణని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం వరకు ఈ కేసుపై మలయాళం చిత్ర పరిశ్రమలోని నటీనటులందరూ దిలీప్ పై విమర్శలు చేశారు. పలువురు మాత్రం ఈ విషయాన్నీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సీనియర్ హీరోయిన్స్ మాత్రం నిత్యం ఘటనపై సీరియస్ అవుతూనే ఉన్నారు. 

రీసెంట్ గా మరో సీనియర్ నటి రేవతి, పద్మప్రియ, పార్వతిలు ఒక లేఖ ద్వారా అమ్మ(అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌)కు డెడ్ లైన్ విధించారు. దిలీప్ సభ్యత్వాన్ని తొలగిస్తారా లేదా అనే అంశంపై అక్టోబర్ 9లోగా ఫైనల్ నిర్ణయాన్ని చెప్పాలని లేఖలో పేర్కొన్నారు. ఇది వరకే రేవతి అమ్మకు రెండు సార్లు లేఖరాశారు. కానీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పటికైనా సరైన వివరణ ఇవ్వాలని దిలీప్ కేసు విచారణ దశలో ఉండగా కమిటీలో ఎలా కొనసాగిస్తారని అతన్ని బయటకి నెట్టేస్తారా? లేదా? ప్రశ్నించారు. రేవతి తరహాలోనే చాలా మంది సినీ ప్రముఖులు బహిరంగంగా ఈ విషయంపై విమర్శలు చేసినప్పటికీ అసోసియేషన్ సభ్యులు పట్టించుకోకపోవడం గమనార్హం.