Asianet News TeluguAsianet News Telugu

శాడిజం చూపిస్తా అంటూ రేవంత్ ఫైర్.. బ్యాలెన్స్ చేయలేక అసహనం

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో టికెట్ టు ఫినాలే టాస్క్ జోరుగా సాగుతోంది. నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వరుసగా టికెట్ టు ఫినాలే టాస్క్ లు ఇచ్చారు.

Revanth shocking comments in ticket to finale task
Author
First Published Nov 30, 2022, 11:12 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో టికెట్ టు ఫినాలే టాస్క్ జోరుగా సాగుతోంది. నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు వరుసగా టికెట్ టు ఫినాలే టాస్క్ లు ఇచ్చారు. ఒక్కో టాస్క్ వైవిధ్యంగా ఉంటూ ఆసక్తిని రేకెత్తించింది. 

ఎప్పటిలాగే ఇంటి సభ్యుల అసహనాలు, మాటల యుద్ధం కొనసాగాయి. టికెట్ టు ఫినాలేలో పాల్గొనే అవకాశం మరోసారి దక్కినప్పటికీ ఇనయ వినియోగించుకోలేకపోయింది. ఆ టాస్క్ లో కీర్తి విజయం సాధించింది. ఆ తర్వాత బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే పోటీలో పాల్గొనే సభ్యులకు .. జండాలు జగడం అనే టాస్క్ ఇచ్చారు. 

ఇందులో భాగంగా సభ్యులు అడ్డంకులు దాటుకుంటూ బాల్స్ ని బాస్కెట్ లో వేయాలి. ముందుగా బాస్కెట్ లో బాల్ వేసిన వారికీ జెండాని మొదటి స్థానంలో ఉంచే అవకాశం ఉంటుంది. తద్వారా టికెట్ టు ఫినాలే రేసులో వారు ముందు ఉంటారు. ఈ టాస్క్ లో వరుసగా రేవంత్, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహన్, కీర్తి జెండాలని పాతారు. 

మరో టాస్క్ లో భాగంగా ఇంటిసభ్యులే ఏకాభిప్రాయంతో టికెట్ టు ఫినాలే కి ఎవరు అర్హులే తేల్చాలి. ఈ ప్రతిపాదనని ఇంటి సభ్యులంతా వ్యతిరేకించారు. తామంతా కష్టపడుతున్నది టికెట్ టు ఫినాలే కోసమే అయితే.. ఇందులో ఏకాభిప్రాయం ఎలా ఉంటుంది అని శ్రీహన్, ఆదిరెడ్డి బిగ్ బాస్ ని వ్యతిరేకించారు. 

మరో టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు ప్లేట్ లు, కప్పులు, సాసర్ లని బ్యాలెన్స్ చేయాలి. అలా చివరి వరకు బ్యాలెన్స్ చేసిన వారు విజేతలు. ముందుగా ఫైమా ఈ టాస్క్ నుంచి అవుట్ అయింది. చివరకి ఈ టాస్క్ లో ఆదిరెడ్డి విజేతగా నిలిచారు. ఈ టాస్క్ బాగా కష్టంగా ఉండడంతో రేవంత్ అసహనం వ్యక్తం చేశాడు. సంచాలక్ గా వ్యవహరిస్తున్న శ్రీ సత్యపై రేవంత్ ఫైర్ అయ్యాడు. శాడిజం నేను కూడా చూపిస్తా అంటూ వెళ్ళిపోయాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios