Asianet News TeluguAsianet News Telugu

పాప తన నుంచి దూరం కావడంతో రేవంత్‌ ఎమోషనల్‌.. తన భార్యని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 6,తొమ్మిదో రోజు(మంగళవారం) ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ హైలైట్‌గా నిలిచింది. ఇందులో `సిసింద్రీ` టాస్క్ లో రేవంత్‌ ఎమోషనల్‌ కావడం ఆకట్టుకుంది.

revanth emotional remembering her wife, baby sisindri and geetu kisses to bigg boss
Author
First Published Sep 13, 2022, 11:36 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ రెండో వారానికి చేరుకుంది. రెండో వారం సంబంధించి సోమవారం జరిగిన నామినేషన్‌ ప్రక్రియలో రాజ్‌ శేఖర్‌, షాని, అభినయ శ్రీ, రోహిత్‌, మరీనా, ఆదిరెడ్డి, గీతూ రాయల్‌, రేవంత్‌, ఫైమా నామినేట్‌ అయ్యారు. తొమ్మిదో రోజు(మంగళవారం) హౌజ్‌లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో మొదట `సిసింద్రీ` టాస్క్ ఇచ్చారు. హౌజ్‌లోని ప్రతి సభ్యుడికి కెప్టెన్సీ కంటెండర్‌ షిప్‌ ని ఓ బేబీ రూపంలో లభిస్తుంది. 

ఇందులో భాగంగా బేబీకి సంబంధించి కేర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. డైపర్స్ మార్చడం, పాలు తాగించడం, ఇతర పనులన్నీ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే బేబీని నిర్లక్ష్యం చేస్తారో, పాపని మరోకరు లభించేలా చేస్తారో వారం కెప్టెన్సీ కంటెండర్‌ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్బంగా ఇచ్చిన టాస్క్ లో బజర్‌ మోగినప్పుడు గార్డెన్‌ ఏరియాలో ఉన్న ఐదు బేబీ చైర్‌లో బేబీని పెట్టిన వారు నెక్ట్స్ కెప్టెన్సీ టాస్క్ కి ఎంపికవుతారు. ఫైమా, రేవంత్‌, చంటి, కీర్తి, ఆరోహి గోనె సంచులు తొడుక్కుని బాక్సెస్‌ ఫిల్‌ చేసే పోటీలో పాల్గొనగా, చంటి విన్నర్‌గా నిలిచారు. 

ఈ సందర్భంగా తన బేబీని తన వద్ద నుంచి మరొకరు తీసుకోవడంతో ఈ పోటీల నుంచి రేవంత్‌ వైదొలగాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ బేబీని స్టోర్‌ రూమ్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఇది జరగాక రేవంత్‌ ఎమోషనల్‌ అయ్యారు. రాత్రి ఆ బేబీని తన పక్కనే పడుకో బెట్టుకుందామనుకున్నా అంటూ మరీనా, రోహిత్ ల వద్ద ఎమోషనల్‌ అయ్యారు. ఈ సందర్బంగా తన భార్య ప్రెగ్నెంట్‌ తో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ఇందులో బేబీ కేరింగ్‌ విషయంలో మరీనా కేరింగ్‌ ప్రశంసలు పొందగా, ఫైమా సైతం బాగానే చేసింది. కానీ గీతూ రాయల్‌ని మాత్రం బిగ్‌ బాస్‌ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. తానెప్పుడు పిల్లగాళ్లు కనిపిస్తే కొట్టేదాన్ని అని, కానీ ఇలా ఎప్పుడూ చూసుకోలేదని, చాలా ఇబ్బందిగాఉందంటూ తనదైన స్టయిల్‌లో బిగ్‌బాస్‌కి సెటైరికల్‌గా చెప్పింది గీతూ. దీంతో పదే పదే బిగ్‌ బాస్‌ ఆమెని తన బేబీకి డైపర్స్ మార్చాలని ఆదేశాలివ్వడం నవ్వులు పూయించింది. 

మరోవైపు ఈ సందర్భంగా తన గేమ్‌స్ట్రాటజీ గురించి చెబుతూ గీతూ బిగ్‌ బాస్‌పై ముద్దుల వర్షం కురిపించింది. ఇంకోవైపు అంతకు ముందు బెడ్‌ రూమ్‌లో భార్యాభర్తలు మరీనా, రోహిత్‌  ప్రేమతో ముద్దులాడుకోవడం సైతం క్యూట్‌గా అనిపించడం విశేషం. అలాగే సిసింద్రీ గేమ్‌లో రేవంత్‌-ఫైమాకి, రేవంత్‌కి-నేహా చౌదరి మధ్య గొడవలు హైలైట్‌గా నిలిచాయి. అదే సమయంలో ఆదిరెడ్డి-గీతూ, బాలాదిత్య-రేవంత్‌ టీమ్‌లు చేసే ప్లాన్‌లు ఆకట్టుకునేలా ఉండటం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios